ట్రక్కు, లారీ ఢీ.. భారీ పేలుడు

two dies after tankertruck crash in Italy - Sakshi

రోమ్‌ : ఇటలీలో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. పేలుడు పదార్థాలను తీసుకువెళుతున్న ఓ ట్రక్కు, లారీ వెనకభాగాన్ని ఢీకొట్టింది. దీంతో భారీ పేలుడు సంభవించింది. పేలుడు దాటికి రోడ్డు మార్గం పాక్షికంగా పాడైంది. ఈ ప్రమాదంలో ఇద్దరు మృతిచెందగా, 70 మందికిపైగా గాయాలయ్యాయి. ఉత్తర ఇటలీలోని బొలోగ్నా నగరంలో ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. పేలుడు దాటికి సమీపంలోని ఇళ్ల కిటికీ అద్దాలు పగిలిపోయాయి. దట్టమైన పొగకారణంగా చుట్టుపక్కల నివసించే ప్రజలు తాత్కాలిక ఉపశమనం కోసం సురక్షిత ప్రాంతాలకు వెళుతున్నారు.

రోడ్డు ప్రమాదం జరిగిన తర్వాత భారీ పేలుడు సంభవించడానికి కొద్ది సమయం పట్టింది. దీంతో ట్రక్కు చుట్టు పక్కనే ఉన్న కార్లు, వ్యాన్లు ఇతర వాహనాలు వెనక్కు వెళ్లిపోయాయి. రోడ్డు ప్రమాదం జరిగిన వెంటనే భారీ విస్పోటనం సంభవిస్తే మరింత ప్రాణ నష్టం జరిగి ఉండేదని అధికారులు తెలిపారు. 

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top