గ్రహం అనుగ్రహం, శనివారం 8, అక్టోబర్ 2016 | graham anugram for the day of october 8th 2016 | Sakshi
Sakshi News home page

గ్రహం అనుగ్రహం, శనివారం 8, అక్టోబర్ 2016

Oct 8 2016 12:52 AM | Updated on Aug 21 2018 12:03 PM

గ్రహం అనుగ్రహం, శనివారం 8, అక్టోబర్ 2016 - Sakshi

గ్రహం అనుగ్రహం, శనివారం 8, అక్టోబర్ 2016

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు

శ్రీ దుర్ముఖినామ సంవత్సరం, దక్షిణాయనం, శరదృతువు
ఆశ్వయుజ మాసం, తిథి శు.సప్తమి సా.4.25 వరకు, తదుపరి అష్టమి
నక్షత్రం మూల ప.1.11 వరకు, తదుపరి పూర్వాషాఢ, వర్జ్యం రా.11.25
నుంచి 1.07 వరకు, దుర్ముహూర్తం ఉ.5.55 నుంచి 7.30 వరకు
అమృతఘడియలు ఉ.6.18 నుంచి 8.01 వరకు


సూర్యోదయం     :    5.54
సూర్యాస్తమయం    :    5.47
రాహుకాలం :  ఉ.9.00 నుంచి 10.30 వరకు
యమగండం :  ప.1.30 నుంచి 3.00 వరకు

భవిష్యం
మేషం: అనుకోని ప్రయాణాలు. కుటుంబ, ఆరోగ్యసమస్యలు. ఆదాయానికి మించి ఖర్చులు. మిత్రులతో కలహాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.
 
వృషభం: పనుల్లో ఆటంకాలు. రాబడి అంతగా కనిపించదు. ఆస్తి వివాదాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. దైవదర్శనాలు. వృత్తి, వ్యాపారాలు నిరాశ పర చవచ్చు.
 
మిథునం: కొత్త మిత్రుల పరిచయం. శుభవార్తలు అందుతాయి. వ్యవహారాలలో విజయం. వాహనయోగం. ముఖ్య నిర్ణయాలు. వృత్తి, వ్యాపారాలలో ప్రోత్సాహం.
 
కర్కాటకం:
శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. పోటీపరీక్షల్లో విజయం. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ముందడుగు వేస్తారు.
 
సింహం: వ్యయప్రయాసలు. అనుకున్న పనుల్లో జాప్యం. ఆర్థిక ఇబ్బందులు. ఆరోగ్యపరంగా చికాకులు. దూరప్రయాణాలు. వృత్తి, వ్యాపారాలు అంతగా అనుకూలించవు.
 
 కన్య: ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. ఆర్థిక లావాదేవీలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వ్యాపార, ఉద్యోగాలలో సమస్యలు.
 
తుల: కుటుంబసభ్యులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహపరుస్తుంది. బంధువుల నుంచి ఒత్తిడులు. దైవచింతన. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు.
 
వృశ్చికం: మిత్రులతో స్వల్ప విభేదాలు. ఆర్థిక సమస్యలు. అనారోగ్యం. మీ ప్రయత్నాలు వృథా కాగలవు. ఆలయ దర్శనాలు. వృత్తి,వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి.
 
ధనుస్సు: కార్యజయం. భూవివాదాలు పరిష్కారం. శుభకార్యాలకు హాజరవుతారు. ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఉత్సాహవంతంగా ఉంటాయి.
 
 మకరం: కొన్ని పనులు మధ్యలో విరమిస్తారు. శ్రమ పడ్డా ఫలితం కనిపించదు. భూ వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. అనారోగ్యం. వృత్తి, వ్యాపారాలలో చికాకులు.
 
కుంభం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. సంఘంలో గౌరవం. వస్తు లాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపార,  ఉద్యోగాలలో కొత్త ఆశలు.
 
మీనం: కార్యక్రమాలు సజావుగా సాగుతాయి. దూరపు బంధువుల కలయిక. విందువినోదాలు. కొన్ని వివాదాలు తీరతాయి. వ్యాపార, ఉద్యోగాలలో అనుకూలం.
 - సింహంభట్ల సుబ్బారావు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement