
శరద్‌పవార్‌తో వైఎస్ జగన్ భేటీ
తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారు.
న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లును అడ్డుకునేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా కృషిచేస్తున్నారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ తో జగన్ భేటి అయ్యారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని పవార్ దృష్టికి తీసుకెళ్లారు. సమైక్యాంధ్రకు మద్దతు ఇవ్వాలని జగన్ కోరారు.
రాష్ట్ర విభజనను అడ్డుకునేందుకు జగన్.. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీతో సహా పలువురు జాతీయ నాయకులను కలిసిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, పార్టీకి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు రాష్ట్రపతితో సమావేశమయ్యారు. బీజేపీ అగ్రనేత ఎల్ కె అద్వానీ, సీపీఎం నేత ప్రకాశ్ కారత్ తదితర జాతీయ నేతలను జగన్ కలిశారు.