మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాటలో తానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రకటించారు. మందస మండలం హరిపురంలో శుక్రవారం ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు.
పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు
మందస, న్యూస్‌లైన్: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు బాటలో తానూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరతానని శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే జుత్తు జగన్నాయకులు ప్రకటించారు. మందస మండలం హరిపురంలో శుక్రవారం ఆయన ముఖ్యకార్యకర్తలతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేందుకు వీలుగా ప్రజలు విశ్వసించే పార్టీలోకి వెళ్లాలని ఆలోచిస్తున్నానని, ఈ విషయమై అభిప్రాయాలు చెప్పాలని కోరారు. తాము కోరుకునేదీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీయేనేనని, జైజగన్ అంటూ పెద్దపెట్టున నినాదాలు చేశారు. మీ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని, అందరూ సహకరిస్తే తనకు గుర్తింపునిచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి కలలు సాకారం చేసేందుకు మరింత కృషి చేస్తానని ఎమ్మెల్యే చెప్పారు.