అమెరికాలో ఇద్దరు భారతీయుల కాల్చివేత | Two Indians shot dead in US | Sakshi
Sakshi News home page

అమెరికాలో ఇద్దరు భారతీయుల కాల్చివేత

Sep 6 2013 8:28 PM | Updated on Apr 4 2019 3:25 PM

అమెరికాలో ఇద్దరు భారతీయులను కాల్చిచంపారు. మృతులు జగ్తర్ భట్టి(55), పవన్ సింగ్(20)గా గురించారు.

అమెరికాలో ఇద్దరు భారతీయులను కాల్చిచంపారు. మృతులు జగ్తర్ భట్టి(55), పవన్ సింగ్(20)గా గురించారు. ఉత్తర ఇండియానా నగరంలోని మిడిల్బరీ స్ట్రీట్లో ఈ సంఘటన జరిగింది. 400 బ్లాకులు ఉన్న కన్వీనియన్స్ స్టోర్లో ఈ ఘాతుకం చోటుచేసుకుంది. ముసుగు ధరించి వచ్చిన ఇద్దరు దుండగులు వారిని కాల్చిచంపినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.

ఈ జంట హత్యలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అసలేం జరిగిందో పోలీసుల నుంచి తెలుసుకునేందుకు మృతుల కుటుంబ సభ్యులు, సన్నిహిత ప్రయత్నిస్తున్నట్టు స్థానిక మీడియా పేర్కొంది. అయితే దుండగుల కాల్పుల్లో మృతి చెందిన భట్టి, పవన్ అందరితో ఎంతో స్నేహంగా మెలిగేవారని పొరుగున ఉంటున్న ఓ మహిళ తెలిపింది. తనను సొంత కుటుంబ సభ్యురాలిగా భావించేవారని వెల్లడించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement