అరశాతం రేట్ల కోతకు చాన్స్! | To cut rates by half a chance! | Sakshi
Sakshi News home page

అరశాతం రేట్ల కోతకు చాన్స్!

Apr 4 2016 12:07 AM | Updated on Sep 3 2017 9:08 PM

అరశాతం రేట్ల కోతకు చాన్స్!

అరశాతం రేట్ల కోతకు చాన్స్!

2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) .....

రేపే ఆర్‌బీఐ ద్రవ్య, పరపతి విధాన సమీక్ష

 

హైదరాబాద్: 2016-17 ఆర్థిక సంవత్సరం మొదటి  రిజర్వ్ బ్యాంక్ (ఆర్‌బీఐ) ద్రవ్య, పరపతి విధాన సమీక్ష మంగళవారం (ఏప్రిల్ 5న) జరగనుంది. ప్రభుత్వ ఆర్థిక స్థిరీకరణ, మార్కెట్ అంచనాలకు ఆర్‌బీఐ పాలసీ వడ్డీ రేట్లను 0.50 శాతం వరకు తగ్గించవచ్చని పరిశ్రమ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఆర్థికమంత్రి అరుణ్‌జైట్లీ గతవారం ఆర్‌బీఐ వడ్డీరేట్లను తగ్గించాలని కోరారు. ‘‘అధిక వడ్డీ రేట్లు దేశ ఆర్థిక వ్యవస్థను మందకొడిగా మారుతున్నాయని.. అందుకే ద్రవ్యోల్బణాన్ని తగ్గించాలంటే ఆర్‌బీఐ వడ్డీరేటును దాదాపు 0.25 శాతం వరకు తగ్గించాలని బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర సీఎండీ సుశీల్ చెప్పారు. 0.5 శాతం రేట్ల తగ్గింపునకు అధిక అవకాశముందని ఓ బ్యాంక్ సీనియర్ అధికారి చెప్పారు. 0.25% పాలసీ రేటు తగ్గింపు దాదాపు ఖరారైనట్టే.


కానీ, కనీసం 0.50 శాతం కనీసం తగ్గింపుతోనే రుణాలపై వడ్డీరేట్లు దిగొచ్చేందుకు ఆస్కారం లభిస్తుందని పారిశ్రామిక వర్గాలు పేర్కొన్నారు. ‘‘ఆర్‌బీఐ ద్రవ్య అస్థిరతను అరికట్టేందుకు చర్యలు తీసుకుంటుంది. వ్యవసాయాత్మక ద్రవ్య విధాన సమస్యల్ని పరిష్కరిస్తుందని మేం ఆశిస్తున్నామని’’ ఎస్‌బీఐ చీఫ్ అరుంధతి భట్టాచార్య చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement