దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మారుస్తూ రిజర్వు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దక్కన్ గ్రామీణ బ్యాంకు పేరు మారింది. తెలంగాణ గ్రామీణ బ్యాంకుగా (టీజీబీ) మారుస్తూ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారిక ప్రకటన జారీ చేసింది. దక్కన్ గ్రామీణ బ్యాంకును టీజీబీగా మారుస్తూ గతేడాది అక్టోబరు 20న కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి తెలిసిందే. టీజీబీలో కేంద్ర ప్రభుత్వానికి 50 శాతం, తెలంగాణ ప్రభుత్వానికి 15 శాతం, స్పాన్సర్ బ్యాంకు అయిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్‌కు మిగిలిన 35 శాతం వాటా ఉంది. 300లకుపైగా శాఖలతో ఆదిలాబాద్, కరీంనగర్, నిజామాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్‌లో బ్యాంకు సేవలందిస్తోంది.