తెలంగాణలో రైతుల రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు.
హైదరాబాద్: తెలంగాణలో రైతుల రుణాలను ఒకే విడతలో మాఫీ చేయాలని ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకోవాలని అన్నారు. రైతు కుటుంబాలకు పింఛన్ ఇవ్వడంతో పాటు వారి పిల్లలను ప్రభుత్వం చదివించాలని దిగ్విజయ్ కోరారు.
మంగళవారం దిగ్విజయ్ మెదక్ జిల్లా కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. నారాయణ్ఖేడ్ ఉప ఎన్నిక గురించి పార్టీ నేతలతో చర్చించారు. నారాయణ్ ఖేడ్ ఎమ్మెల్యే పటోళ్ల కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించడంతో ఉప ఎన్నక జరగనుంది.