ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు నాకొద్దు.. | Sr journalist Akshaya Mukul refuses to receive Ramnath Goenka award from Modi | Sakshi
Sakshi News home page

ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు నాకొద్దు..

Nov 3 2016 1:05 PM | Updated on Aug 21 2018 9:33 PM

ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు నాకొద్దు.. - Sakshi

ప్రధాని చేతుల మీదుగా ఈ అవార్డు నాకొద్దు..

టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్, ప్రధాని నరేంద్రమోదీ నుంచి స్వీకరించే రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును తిరస్కరించారు.

టైమ్స్ ఆఫ్ ఇండియా సీనియర్ జర్నలిస్టు అక్షయా ముఖుల్, ప్రధాని నరేంద్రమోదీ నుంచి స్వీకరించే రామ్‌నాథ్ గోయెంకా ఎక్సలెన్స్ ఇన్ జర్నలిజం అవార్డును తిరస్కరించారు. ముఖుల్ అవార్డుల ప్రధానోత్సవం నుంచి బాయ్కాట్ చేశారు. ఆయన తరుఫున హార్పర్ కాలిన్స్ ఇండియా చీఫ్ ఎడిటర్, పబ్లిషర్ క్రిష్ణ చోప్రా ఈ అవార్డును అందుకున్నారు. తనకు ఈ అవార్డు దక్కడం చాలా గౌరవంగా ఉందని, కానీ ప్రధాని మోదీ చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం ఇష్టంలేక కార్యక్రమం నుంచి వెళ్లిపోయానని ముఖుల్ తెలిపారు.   కాల్పనికేతర పుస్తక కేటగిరీలో గీతా ప్రెస్, ది మేకింగ్ ఆఫ్ హిందూ ఇండియాకు ఈ అవార్డు దక్కింది. వివిధ మూలాల నుంచి ఈ బుక్ విమర్శకుల ప్రశంసలను ఈ బుక్ అందుకుంది.
 
భారతదేశ హిందుత్వ సిద్ధాంతకర్తల్లో జాతీయ, తీవ్రవాద చరిత్రను ఈ బుక్లో వివరించారు.  2015 ఆగస్టులో ఈ బుక్ విడుదలైంది.  విడుదల అనంతరం బుక్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, అట్టా గలాట్టా-బెంగళూరు లిటరేచర్ ఫెస్టివల్ బుక్ ఫ్రైజ్లను కూడా ఈ బుక్ సొంతంచేసుకుంది.  మోదీ ఆలోచనలతో తాను జీవిస్తున్నట్టు ఒకే ఫ్రేమ్లో నిల్చొని, నవ్వుతూ అవార్డు స్వీకరించడం ఇష్టలేదని అందుకే కార్యక్రమం నుంచి బాయ్ కాట్ చేసినట్టు తెలిపారు. బుధవారం జరిగిన ఈ ప్రధానోత్సవంలో అవార్డు గ్రహితలందరికీ మోదీ శుభాకాంక్షలు చెప్పారు. ఈ సందర్భంగా రామ్ నాథ్ గోయెంకాకు నివాళులర్పించారు. స్వాతంత్య్ర దినోత్సవ  సమయంలో వార్తాపత్రికల కృషిని ఆయన గుర్తుచేసుకున్నారు. అనంతరం టెక్నాలజీ మీడియాకు ఒక సవాలుగా మారిందని, అప్పట్లో వార్తలు అందించడానికి 24 గంటల్లో పట్టే సమయం, ఇప్పుడు 24 నిమిషాల్లో ప్రజల ముందు ఉంటుందని మోదీ కొనియాడారు.    
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement