చిన్న ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణ బాండ్లు | Small investors, inflation bonds | Sakshi
Sakshi News home page

చిన్న ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణ బాండ్లు

Dec 3 2013 1:54 AM | Updated on Oct 2 2018 5:51 PM

చిన్న ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణ బాండ్లు - Sakshi

చిన్న ఇన్వెస్టర్లకు ద్రవ్యోల్బణ బాండ్లు

చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం ఈ నెల చివర్లో రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) ఆధారిత సెక్యూరిటీల(బాండ్లు)ను ప్రవేశపెట్టనుంది

 న్యూఢిల్లీ: చిన్న, మధ్యతరహా ఇన్వెస్టర్ల కోసం ప్రభుత్వం ఈ నెల చివర్లో రిటైల్ ద్రవ్యోల్బణ(సీపీఐ) ఆధారిత సెక్యూరిటీల(బాండ్లు)ను ప్రవేశపెట్టనుంది. సీపీఐ ఆధారంగా వడ్డీ లభించే వీటిని ద్రవ్యోల్బణ సూచీ జాతీయ పొదుపు పత్రాలు(ఐఐఎన్‌ఎస్‌ఎస్)-క్యుములేటివ్‌గా వ్యవహరించనున్నారు. ప్రభుత్వం 2013-14కు ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదనమేరకు వీటిని విడుదల చేయనుంది. ప్రధానంగా చిన్న, మధ్య తరహా ఇన్వెస్టర్ల పొదుపు సొమ్ముకు ద్రవ్యోల్బణ ప్రభావం నుంచి రక్షణ కల్పించే యోచనతో వీటిని రూపొందించినట్లు ఆర్థిక శాఖ పేర్కొంది.

 

  ఈ సెక్యూరిటీలను బ్యాంకుల ద్వారా విక్రయించనున్నట్లు తెలిపింది. వీటికి రెండు పద్ధతుల్లో వడ్డీ రేటును చెల్లించనున్నారు. స్థిర ప్రాతిపదికన 1.5% వార్షిక వడ్డీతోపాటు, ఆరు నెలలకు ఒకసారి సీపీఐ ఆధారంగా వడ్డీని చెల్లించనున్నారు. అయితే ఈ మొత్తాన్ని కాలపరిమితి ముగిసేసమయానికి అందిస్తారు. కాగా, ముందుగానే సొమ్మును వాపసు తీసుకునేందుకు సీనియర్ సిటిజన్లకు  ఏడాది తరువాత అవకాశముంది. ఇతరులకు మూడేళ్ల తరువాత మాత్రమే ఇందుకు వీలుంటుంది. అయితే నియమిత కాలాల్లోనే ఇందుకు అనుమతించడంతోపాటు, పెనాల్టీ చార్జీలను విధిస్తారు.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement