ప్రధాని మోదీపై ఫత్వా జారీ

ప్రధాని మోదీపై ఫత్వా జారీ


కోలకతా: పెద్దనోట్ల రద్దుతో పేదలన్ని కష్టల్లోకి నెట్టాశారని ఆరోపిస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీకి వ్యతిరేకంగా ఫత్వా జారీ అయింది. దేశంలో డీమానిటైజేషన్  ప్రభావాల్ని  ఖండించిన  కోలకతా లోని టిప్పు సుల్తాన్ మసీదు ఇమామ్ ప్రధానికి వ్యతిరేకంగా ఆదివారం 'ఫత్వా' జారీ చేసింది. సమాజాన్ని,  అమాయక ప్రజల్ని మోదీ మోసం చేస్తున్నారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో ఆయన ప్రధానమంత్రిగా కొనసాగాలని ఎవరూ కోరుకోవడం లేదన్నారు.  మహ్మద్ నురూర్ రెహమాన్ బార్కాతి అని పిలిచే  షాహి ఇమామ్ సయ్యద్  పెద్దనోట్ల రద్దు తర్వాత  ప్రతీరోజు ప్రజలు వేధింపులకు గురయ్యారని, తీవ్ర బాధలు పడుతున్నారని ఆరోపించారు.ఆల్ ఇండియా  మజ్లిస్-ఇ-సుర , ఆల్ ఇండియా మైనారిటీ ఫోరం ఆధ్వర్యంలో జరిగిన  ఉమ్మడి సమావేశంలో  ఆయన  ఈ వ్యాఖ్యలు చేశారు.
మరోవైపు మోదీపై ఫత్వా జారీచేయడంపై బీజేపీ మండిపడింది. బీజేపీ జాతీయ సెక్రటరీ సిద్ధార్థ్ నాథ్ సింగ్  సయాద్ వ్యాఖ్యల్ని తీవ్రంగా ఖండించారు. వెంటనే ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఫత్వా జారీ చేసినప్పుడు తృణమూల్ ఎంపి   ఇద్రిస్ ఆలీ  సయాద్ పక్కన కూర్చుని ఉన్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

 

Back to Top