బాహుబలి-2 20 ఏళ్ల ముందు వచ్చి ఉంటే.. | RanaDaggubati Sir ur screen power is so AWESOME | Sakshi
Sakshi News home page

బాహుబలి-2 20 ఏళ్ల ముందు వచ్చి ఉంటే..

May 1 2017 10:08 AM | Updated on Aug 11 2019 12:52 PM

బాహుబలి-2 పై ప్రశంసలు కురిపిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సారి ట్విట్టర్‌ అందుకున్నారు.

బాహుబలి-2 పై ప్రశంసలు కురిపిస్తున్న వివాదాస్పద దర్శకుడు రామ్‌ గోపాల్‌ వర్మ మరో సారి ట్విట్టర్‌ అందుకున్నారు. అయితే ఈసారి రానా దగ్గుబాటిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.  బీబీ 2 లో రానా నటనకు ఫిదాఅయిపోయిన ఆయన  భల్లాలదేవపై ప్రశంసల జల్లు కురిపించారు.  కండలు తిరిగిన దేహంతో,  పరాక్రమవంతుడైన భల్లాలదేవుడు రూపంలో  దర్శనమిచ్చిన రానాను పొగడుతూ ట్వీట్‌ చేశారు.

అమోఘమైన, అరుదైన శరీర సౌష్టవంతో ఆకట్టుకుంటున్న రానాపై  ఆర్‌జీవీ అమితమైన అభిమానాన్ని  ప్రదర్శించారు.   రానా  స్క్రీన్‌పవర్‌   అద్భుతమని కొనియాడారు. అంతేకాదు  20ఏళ్ల ముందు  బాహుబలి -2  సినిమా వచ్చి ఉంటే  హాలీవుడ్‌ సూపర్‌ స్టార్స్‌ ఆర్నాల్డ్‌ షార్జ్‌నెగ్గర్‌, సిల్విస్టర్‌ స్టాలోన్‌  పేలవంగా నిలిచే వారని ట్వీట్‌  చేశారు.

కాగా  లీడర్ సినిమాలో క్లాస్ లుక్‌తో  ఆకట్టుకున్న రానా ఆ తర్వాత తన బాడీ లాంగ్వేజ్‌తో పాటు శరీరాకృతి కూడా మార్చుకుంటూ వస్తున్నారు. భారీ కండలతో సిక్స్ ప్యాక్‌తో  ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటున్నారు.  కోచ్‌ కునాల్‌ గిర్‌  శిక్షణలో రానా  భారీ కండలవీరుడిగా అవతరించారు. అంతకాదు బాహుబలి మొదటి భాగంలో రానా 108-110 కిలోల మధ్య బరువును, రెండో భాగంలో పాత్రకోసం బాగా తగ్గించే పనిలో  భాగంగా భారీగా కసరత్తు చేసిన సంగతి తెలిసిందే.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement