హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రఘువీరా | Raghuveera Reddy comments on Status | Sakshi
Sakshi News home page

హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రఘువీరా

Sep 25 2016 1:41 AM | Updated on Mar 23 2019 9:10 PM

హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రఘువీరా - Sakshi

హోదా ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం: రఘువీరా

మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు.

సాక్షి, న్యూఢిల్లీ: మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌తో ఏపీ కాంగ్రెస్ నేతలు శనివారం ఢిల్లీలోని ఆయన నివాసంలో సమావేశమయ్యారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వకుండా రాష్ట్ర ప్రజలను బీజేపీ వంచించిన తీరుపై మన్మోహన్‌సింగ్‌తో చర్చించినట్టు పీసీసీ చీఫ్ రఘువీరారెడ్డి మీడియాకు తెలిపారు. గత ప్రభుత్వంలో కేబినెట్ తీర్మానం ద్వారా ఏపీకి హక్కుగా ప్రత్యేక హోదా హామీ ఇస్తే.. దాన్ని పక్కనపెట్టి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ప్యాకేజీ ప్రకటించడంపై మన్మోహన్ సింగ్ ఆవేదన వ్యక్తం చేశారని తెలిపారు. 

ప్రత్యేక హోదాపై ఈనెల 28న తిరుపతి నుంచి ప్రజా బ్యాలెట్ కార్యక్రమాన్ని ప్రారంభించి ఊరూరా తీసుకెళ్తామన్నారు. రాష్ట్రానికి కేంద్రం ఇచ్చే ప్యాకేజీలో పెద్ద మొత్తంలో కమీషన్లు దండుకొనేందుకే చంద్రబాబు ప్యాకేజీని అహ్వానిస్తున్నామని చెప్పారని ఎంపీ కేవీపీ రామచంద్రరావు విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement