బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ రాణి ఆమోదం | Queen to approve Brexit Bill in days, says Theresa May | Sakshi
Sakshi News home page

బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ రాణి ఆమోదం

Mar 17 2017 1:54 AM | Updated on Sep 5 2017 6:16 AM

బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ రాణి ఆమోదం

బ్రెగ్జిట్‌ బిల్లుకు బ్రిటన్‌ రాణి ఆమోదం

‘బ్రెగ్జిట్‌’ బిల్లుకు బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ రాజముద్ర వేశారు.

లండన్‌: ‘బ్రెగ్జిట్‌’ బిల్లుకు బ్రిటన్‌ రాణి రెండో ఎలిజబెత్‌ రాజముద్ర వేశారు. యూరోపియన్‌ యూనియన్‌ నుంచి బయటకు వచ్చే ప్రక్రియ ప్రారంభించేందుకు ఆ దేశ ప్రధాని థెరిసా మేకు అధికారం కల్పిస్తూ రూపొందించిన బిల్లుకు గురువారం ఆమె ఆమోదముద్ర వేశారు. యూరోపియన్‌ యూనియన్‌ (ఉపసంహరణ నోటిఫికేషన్‌) బిల్లును ఇటీవల పార్లమెంట్‌లో ప్రవేశపెట్టారు.

బ్రిటన్‌ రాణి సంతకంతో 28 సభ్య దేశాలు గల ఐరోపా కూటమి నుంచి బ్రిటన్‌ వైదొలగే విషయమై చర్చలు జరిపేందుకు ప్రధానికి అధికారం లభించింది. మరోవైపు కొత్తగా ‘యునైటెడ్‌ ఫ్రంట్‌’ను ఏర్పాటు చేసేందుకు యూకేలోని వేల్స్, స్కాట్లాండ్, ఉత్తర్‌ ఐర్లాండ్‌లో పర్యటించాలని థెరిసా మే ప్రయత్నిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement