ఫికామ్ 4జీ స్మార్ట్‌ఫోన్@ రూ. 10,999 | Phicomm launches 4G-enabled Passion 660 smartphone at Rs 10999 | Sakshi
Sakshi News home page

ఫికామ్ 4జీ స్మార్ట్‌ఫోన్@ రూ. 10,999

Jun 4 2015 1:43 AM | Updated on Sep 3 2017 3:10 AM

ఫికామ్ 4జీ స్మార్ట్‌ఫోన్@ రూ. 10,999

ఫికామ్ 4జీ స్మార్ట్‌ఫోన్@ రూ. 10,999

చైనాకు చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఫికామ్ ‘పాషన్ 660’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్ విడుదలతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది.

 న్యూఢిల్లీ: చైనాకు చెందిన హ్యాండ్‌సెట్స్ తయారీ కంపెనీ ఫికామ్ ‘పాషన్ 660’ అనే 4జీ స్మార్ట్‌ఫోన్ విడుదలతో భారత మార్కెట్‌లోకి ప్రవేశించింది. దీని ధర రూ.10,999. కిట్‌క్యాట్ ఓఎస్‌పై నడిచే ఈ స్మార్ట్‌ఫోన్‌లో ఆక్టాకోర్ ప్రాసెసర్, 2 జీబీ ర్యామ్, 16 జీబీ మెమరి, 13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5 ఎంపీ రియర్ కెమెరా, 5 అంగుళాల తెర, 2,300 ఎంఏహెచ్ బ్యాటరీ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ ఫోన్ జూన్ 9 నుంచి అమెజాన్‌లో వినియోగదారులకు లభించనుంది.  
 
 వచ్చే మూడేళ్లలో రూ.640 కోట్ల పెట్టుబడులు
 భారత్‌లో ఫికామ్ వచ్చే మూడేళ్లలో పలు విభాగాల్లో దాదాపు రూ.640 కోట్లు పెట్టుబడి పెట్టనుంది. దీనితోపాటు తయారీ ప్లాంటును ఏర్పాటుచేయడానికి ప్రణాళికలు రూపొందిస్తున్నామని ఫికామ్ సీఈఓ మిన్ జింగ్ తె లిపారు. వచ్చే ఐదేళ్లలో భారత మొబైల్ హ్యాండ్‌సెట్ మార్కెట్‌లో 5 శాతం వాటాను లక్ష్యంగా నిర్దేశించుకున్నామని పేర్కొన్నారు. ఈ ఏడాది రూ.13,000-రూ.19,000 ధర శ్రేణిలో మూడు నుంచి నాలుగు స్మార్ట్‌ఫోన్లను మార్కెట్‌లోకి విడుదల చేస్తామని ఆయన తెలిపారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement