చైనాలో అరుదైన ఘటన! | Passengers save man's life by pushing train in China | Sakshi
Sakshi News home page

చైనాలో అరుదైన ఘటన!

Aug 5 2017 12:03 PM | Updated on Apr 7 2019 3:24 PM

చైనాలో అరుదైన ఘటన! - Sakshi

చైనాలో అరుదైన ఘటన!

చైనాలో అరుదైన ఘటనలకు కొదవలేనట్టుంది.

చైనాలో అరుదైన ఘటనలకు కొదవలేనట్టుంది. అప్పుడో-ఇప్పుడో చైనాలోని అరుదైన ఘటనలు మనకు తెలుస్తూనే ఉంటాయి. తాజా అరుదైన ఘటన ఈ నెల 3న బీజింగ్‌లోని డాంగ్జీమెన్‌ రైల్వే స్టేషన్‌లో జరిగింది. ఓ వ్యక్తి ఫ్లాట్‌పామ్‌-రైలుకు మధ్య ఇరుక్కుపోయాడు. అతన్ని కాపాడేందుకు మొదట రైల్వే సిబ్బంది ప్రయత్నించినా కుదరలేదు.

దీంతో ప్రయాణికులు తలో చేయి వేశారు. అందరూ కలిసి రైలును అటువైపు తోసి.. ఇరుక్కుపోయిన వ్యక్తి ప్రాణాలను కాపాడారు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు యూట్యూబ్‌లో హల్‌చల్‌ చేస్తున్నాయి. రైలు వస్తున్న సమయంలోనే ఓ వ్యక్తి ప్లాట్‌ఫామ్‌ కిందకు దిగాడని, దీంతో రైల్వే డ్రైవర్ సడన్‌గా బ్రేక్‌ వేసినా అతను ప్లాట్‌ఫామ్‌కు రైలుకు మధ్య ఉండే గ్యాప్‌లో చిక్కుకుపోయాడని, దీంతో తోటి ప్రయాణికులందరూ కలిసి అతన్ని కాపాడారని చానెల్‌ న్యూస్‌ ఏసియా ఒక కథనంలో తెలిపింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement