30 కోట్ల మందికి డిప్రెషన్‌ | Over 300 mn people suffer from depression: WHO | Sakshi
Sakshi News home page

30 కోట్ల మందికి డిప్రెషన్‌

Apr 2 2017 2:07 PM | Updated on Sep 5 2017 7:46 AM

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది డిప్రెషన్‌ తో బాధపడుతున్నారని డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది.

జెనీవా: ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 30 కోట్ల మంది డిప్రెషన్‌ సమస్యతో బాధపడుతున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) వెల్లడించింది. 2005 నుంచి 2015 నాటికి ఈ కేసులు ఏకంగా 18 శాతం పెరిగాయని ఆందోళన వ్యక్తం చేసింది. అభివృద్ధి చెందిన దేశాల్లో డిప్రెషన్‌కు గురయ్యేవారిలో 50 శాతం మంది చికిత్స తీసుకోవడం లేదని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్‌ జనరల్‌ మార్గరెట్‌ చాన్‌ చెప్పారు. 

ప్రపంచ దేశాలన్నీ తమ ఆరోగ్యబడ్జెట్‌లో సగటున 3 శాతమే మానసిక ఆరోగ్యంపై ఖర్చు చేస్తున్నాయని విమర్శించింది. ‘పెరుగుతున్న డిప్రెషన్‌ కేసుల సంఖ్య ప్రపంచ దేశాలకు ఓ హెచ్చరిక వంటిది. ఇప్పటికైనా అన్నిదేశాలు మేల్కొని దీనిపై తమ విధానాలను పునఃసమీక్షించాలి’ అని పిలుపునిచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement