కుప్పకూలిన భవనం; 9మంది మృతి | Nine killed in uttarapradesh house collapse | Sakshi
Sakshi News home page

కుప్పకూలిన భవనం; 9మంది మృతి

Aug 13 2015 5:14 PM | Updated on Sep 3 2017 7:23 AM

శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయిన ఘటనలో 9 మంది మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు.

లక్నో: శిథిలావస్థకు చేరిన ఓ భవనం కుప్పకూలిపోయిన ఘటనలో 9 మంది మృతిచెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్లోని బండాకు 200 కిలోమీటర్ల దూరంలో గురువారం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.

ఈ దుర్ఘటనలో భవనం శిథిలాల కింద చిక్కుకున్న వారిలో 12మందిని రక్షించినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు చెప్పారు. అయితే భవనం శిథిలావస్థకు చేరిందంటూ తాము స్థానిక మున్సిపల్ అధికారులకు ఫిర్యాదు చేసినా, వారు ఎలాంటి చర్య తీసుకోలేదంటూ అక్కడి స్థానికులు ఆరోపించారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement