విశాఖలో బిగ్ ‘సి’ నూతన షోరూమ్ | new showroom opened in vizag | Sakshi
Sakshi News home page

విశాఖలో బిగ్ ‘సి’ నూతన షోరూమ్

Dec 29 2013 1:12 AM | Updated on Aug 28 2018 5:11 PM

హీరోయిన్ శ్రీయ - Sakshi

హీరోయిన్ శ్రీయ

రాష్ట్ర మొబైల్స్ విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ బిగ్ ‘సి’ వైజాగ్ డాబా గార్డెన్స్‌లో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు.

విశాఖ: రాష్ట్ర మొబైల్స్ విక్రయ రంగంలో ప్రముఖ సంస్థ బిగ్ ‘సి’ వైజాగ్ డాబా గార్డెన్స్‌లో తన కొత్త షోరూమ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ హీరోయిన్ శ్రీయ  శనివారం ఈ షోరూమ్‌ను ప్రారంభించారు. అనంతరం షోరూమ్‌లో జరిగిన బిగ్ ‘సి’ 11వ వార్షికోత్సవ వేడుకల్లో ఆమె పాల్గొని కేక్ కట్ చేశారు. ఈ సందర్భంగా సంస్థ డెరైక్టర్ వై. స్వప్న కుమార్ మాట్లాడుతూ, డాబా గార్డెన్స్‌లో ఇది తమ 2వ షోరూమ్ అని అన్నారు. 2000 చదరపు అడుగుల విశాలమైన తమ ఈ తాజా షోరూమ్‌ను వరల్డ్ క్లాస్ లైవ్ ఎక్స్‌పీరియన్స్ షోరూమ్‌గా తీర్చిదిద్దినట్లు వివరించారు. 50కిపైగా మొబైల్స్ లైవ్ డెమోను ఇక్కడ ఏర్పాటు చేశామన్నారు. కస్టమర్ల విశ్వాసం, ఆదరణే తమ ఈ 11 వసంతాల విజయ ప్రస్థానానికి ప్రధాన కారణమని అన్నారు. అందుకే ఈ 11వ వార్షికోత్సవ సందర్భంలో కస్టమర్ల కోసం 11 ప్రత్యేక ఆఫర్లను ప్రవేశపెట్టామని వివరించారు. సినీతార శ్రీయ మాట్లాడుతూ, అందుబాటు ధరల్లోనే అధునాతన ఫీచర్ల మొబైల్స్‌ను ప్రజలకు అందించడం హర్షణీయమన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement