నట్వర్ సింగ్ పద్దతి బాలేదు: షర్మిష్టా ముఖర్జీ | Natwar Singh's revelations not in good taste, says Sharmistha Mukherjee | Sakshi
Sakshi News home page

నట్వర్ సింగ్ పద్దతి బాలేదు: షర్మిష్టా ముఖర్జీ

Published Sun, Aug 3 2014 10:49 PM | Last Updated on Sat, Sep 2 2017 11:19 AM

నట్వర్ సింగ్ పద్దతి బాలేదు: షర్మిష్టా ముఖర్జీ

న్యూఢిల్లీ: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీపై విదేశాంగ మాజీ మంత్రి నట్వర్ సింగ్ వివాదస్పద వ్యాఖ్యలు చేయడాన్ని రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమార్తె షర్మిష్టా ముఖర్జీ తప్పుబట్టారు. ఈవిధంగా వ్యవహరించడం మంచి పద్దతి కాదని హితవు పలికారు. నట్వర్ వ్యవహారం ఏమీ బాలేదని అన్నారు.

నట్వర్ ను నమ్మి ఆయనతో రాజీవ్ గాంధీ పంచుకున్న విషయాలను బహిర్గతం చేయడం మంచి పద్దతి కాదన్నారు. ఇంట్లో తన తండ్రి ప్రణబ్ ముఖర్జీ రాజకీయాల గురించి మాట్లాడరని చెప్పారు. ఓసారి కేబినెట్ లో చర్చించిన విషయం గురించి తాను అడిగినా తన తండ్రి చెప్పలేదని షర్మిష్టా గుర్తు చేసుకున్నారు.
 

Advertisement
 
Advertisement
 
Advertisement