కొడుకు వేధింపులతో తల్లి ఆత్మహత్య | Mother commits suicide by harrassing of son | Sakshi
Sakshi News home page

కొడుకు వేధింపులతో తల్లి ఆత్మహత్య

Aug 30 2015 1:39 PM | Updated on Sep 3 2017 8:25 AM

డబ్బుల కోసం కుమారుడు వేధిస్తుండడంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది.

పగిడ్యాల (కర్నూలు): డబ్బుల కోసం కుమారుడు వేధిస్తుండడంతో ఓ తల్లి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్నూలు జిల్లా పగిడ్యాల మండలం పశ్చిమ పాతకోట గ్రామంలో ఆదివారం జరిగింది. చౌడమ్మకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి.

ప్రభుత్వ టీచర్‌గా పనిచేసిన భర్త రంగసాని మృతి చెందడంతో చౌడమ్మకు నెలకు రూ.10వేలు పింఛను వస్తోంది. ఆ డబ్బుల కోసం చిన్న కుమారుడు కొంత కాలంగా చౌడమ్మను వేధిస్తున్నాడు. శనివారం రాత్రి తల్లిని కొట్టడంతో ఆమె తెలిసిన వారింట్లో ఆశ్రయం పొందింది. ఆదివారం వేకువజామున గ్రామంలోని ఓ బావిలో దూకి ఆత్మహత్య చేసుకుంది.

Advertisement
 
Advertisement
Advertisement