ఒబామాతో భేటీకానున్న మోదీ | Modi departs for New York to hold talks with Obama | Sakshi
Sakshi News home page

ఒబామాతో భేటీకానున్న మోదీ

Sep 28 2015 3:26 PM | Updated on Apr 4 2019 4:25 PM

ఒబామాతో భేటీకానున్న మోదీ - Sakshi

ఒబామాతో భేటీకానున్న మోదీ

అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరికలేకుండా గడపుతున్నారు.

న్యూయార్క్: అమెరికా పర్యటనలో భారత ప్రధాని నరేంద్ర మోదీ తీరికలేకుండా గడపుతున్నారు. సోమవారం ప్రపంచ అగ్రదేశాధినేతలతో మోదీ సమావేశంకానున్నారు. మోదీ సిలికాన్ వ్యాలీ నుంచి న్యూయార్క్కు బయల్దేరారు.

భారత కాలమానం ప్రకారం ఈ రోజు రాత్రి 7 గంటలకు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామాతో మోదీ సమావేశంకానున్నారు. ఏడాదికాలంలో ఈ ఇద్దరు నేతలూ కలవడమిది మూడోసారి. ఇరు దేశాల వ్యూహాత్మక సంబంధాల గురించి మోదీ, ఒబామా దాదాపు గంటా పది నిమిషాల పాటు చర్చించనున్నారు. ఈ సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. మోదీ అంతకుముందు బ్రిటన్ ప్రధాని డేవిడ్ కామెరూన్, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఫ్రాన్కోయిస్ హోలాండెలతో భేటీకానున్నారు. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ సభ్య దేశాధినేతలకు ఇచ్చే విందులో మోదీ పాల్గొంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement