ప్రధాని అలా అనడం సరికాదు: అరుణ్‌ జైట్లీ | Manmohan singh admits his govt failed to curb corruption: Arun Jaitley | Sakshi
Sakshi News home page

ప్రధాని అలా అనడం సరికాదు: అరుణ్‌ జైట్లీ

Jan 3 2014 5:09 PM | Updated on Sep 22 2018 8:22 PM

ప్రధాని అలా అనడం సరికాదు: అరుణ్‌ జైట్లీ - Sakshi

ప్రధాని అలా అనడం సరికాదు: అరుణ్‌ జైట్లీ

దేశంలో అవినీతిని అరికట్టడంతో విఫలమయ్యానని ప్రధాని మన్మోహన్ సింగే ఒప్పుకున్నారని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు.

ఢిల్లీ: దేశంలో అవినీతిని అరికట్టడంలో విఫలమయ్యానని ప్రధాని మన్మోహన్ సింగే ఒప్పుకున్నారని బీజేపీ సీనియర్ నేత అరుణ్‌జైట్లీ వ్యాఖ్యానించారు. మన్మోహన్‌ పరిపాలనలో ఉత్పత్తిదారులు ఆత్మహత్యలు చేసుకున్నారని ఆయన విమర్శించారు. మధ్యవర్తులు కోట్ల రూపాయలు గడించారని ఆరోపించారు. వ్యవసాయ ఖర్చులు గణనీయంగా పెరిగిపోయాయని చెప్పారు.

ఉద్యోగాలు కల్పించలేదన్న విషయాన్ని ప్రధాని మన్మోహన్‌ అంగీకరించారని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు పర్యవేక్షణలో జరిగిన దర్యాప్తులో నరేంద్ర మోడీ నిర్దోషని తేలిందని చెప్పారు. నరేంద్ర మోడీని ప్రజలు నిర్దోషని మూడుసార్లు తీర్పిచ్చి గెలిపించారని తెలిపారు. దేశంలో ఏ రాజకీయ నేత మీదా ఇప్పటివరకూ ఇలాంటి దర్యాప్తులు జరగలేదని అరుణ్‌జైట్లీ గుర్తుచేశారు. మోడీనుద్దేశించి ప్రధాని అలా వ్యాఖ్యానించడం సరికాదని అరుణ్‌జైట్లీ అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement