'ప్రధాని మంత్రిగా చూడాలని ఉంది' | 'Mamata Banerjee only ideal candidate for PM' | Sakshi
Sakshi News home page

'ప్రధాని మంత్రిగా చూడాలని ఉంది'

Jan 30 2014 3:22 PM | Updated on Sep 2 2017 3:11 AM

'ప్రధాని మంత్రిగా చూడాలని ఉంది'

'ప్రధాని మంత్రిగా చూడాలని ఉంది'

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి పదవికి సరియైన అభ్యర్థి అని రచయిత మహాశ్వేతా దేవి అన్నారు.

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధాన మంత్రి పదవికి సరియైన అభ్యర్థి అని రచయిత మహాశ్వేతా దేవి అన్నారు. బ్రిగేడ్ పరేడ్ గ్రౌండ్స్ లో గురువారం నిర్వహించిన తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ర్యాలీలో మహశ్వేతాదేవి మాట్లాడుతూ...దీదీని ప్రధానమంత్రిగా చూడాలని ఉంది అని అన్నారు. ప్రధాని పదవికి అన్ని అర్హతలున్నవ్యక్తి మమతా అని అన్నారు.

అంతేకాకుండా పేద ప్రజల కోసం ఎనలేని కృషి చేస్తున్నారు అని అన్నారు. వామపక్ష ప్రభుత్వానికంటే మమతా బెనర్జీ ప్రభుత్వం మేలైన పాలనను అందిస్తోంది అని అన్నారు. మావోయిస్టులకు గట్టి పట్టున్న జంగల్ మహల్, డార్జిలింగ్ ప్రాంతాలో మమత పనితీరు అద్బుతంగా ఉంది అని మహాశ్వేతాదేవి కితాబిచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement