బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానా | Sakshi
Sakshi News home page

బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానా

Published Mon, Sep 14 2015 5:22 PM

బాస్ కూతురిపై వేధింపులు.. లక్షన్నర జరిమానా - Sakshi

బాస్ కూతురిని ఫోన్ కాల్స్, మెసేజిలు, వాయిస్ మెసేజిలతో వేధించినందుకు ఆస్ట్రేలియాలో పనిచేసే ఓ భారత సంతతి ఇంజనీర్కు దాదాపు లక్షన్నర రూపాయల జరిమానా విధించడంతో పాటు, స్వదేశానికి తిరిగి వెళ్లిపోవాలని ఆదేశించారు. కెనడా పాస్పోర్టు ఉన్న అభినవ్ సింగ్ (33).. తన ఆఫీసులోనే పనిచేసే బాస్ కూతురికి వందలాది ఎస్ఎంఎస్లు, ఫోన్ కాల్స్, వాయిస్ మెసేజిలు పంపేవాడు. పోలీసులు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా అతడు వినిపించుకోలేదు. అయితే, తాను ఆమెను ప్రేమిస్తున్నానని, ఆ విషయాన్ని ఆమెకు చెప్పే హక్కు తనకుందని అభినవ్ సింగ్ వాదిస్తున్నాడు.

ఇక ఇప్పుడు తాను అధికారికంగా యుద్ధం ప్రకటిస్తున్నానని, ఎలాగైనా ఆమె ప్రేమను పొందుతానని ధీమా వ్యక్తం చేశాడు. ఆమె ఎప్పుడూ సింగ్ మీద ప్రేమ ఉన్నట్లు చెప్పలేదని, అయినా ఆఫీసు రికార్డులు గాలించి ఆమె నంబరు తీసుకుని మరీ వేధించాడని ప్రాసిక్యూషన్ వర్గాలు ఆరోపించాయి. తర్వాత సింగ్ను ఇమ్మిగ్రేషన్ శాఖ, బోర్డర్ ప్రొటెక్షన్ శాఖలు అరెస్టు చేశాయి. అతడి వల్ల డాక్టర్గా పనిచేసే భార్య, ఇద్దరు పిల్లలు కూడా ఇబ్బందుల్లో పడ్డారని డిఫెన్స్ న్యాయవాది పేర్కొన్నారు.

Advertisement
Advertisement