జర్న‌లిస్టు కుటుంబానికి మంచు విష్ణు సాయం | Hero Manchu Vishnu helps journalist durga goud family | Sakshi
Sakshi News home page

జర్న‌లిస్టు కుటుంబానికి మంచు విష్ణు సాయం

Jul 6 2016 6:35 PM | Updated on Sep 4 2017 4:16 AM

జర్న‌లిస్టు కుటుంబానికి మంచు విష్ణు సాయం

జర్న‌లిస్టు కుటుంబానికి మంచు విష్ణు సాయం

రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ గ్రేట్‌ హీరో అనిపించుకున్నాడు మంచు విష్ణు. ప‌క్ష‌వాతానికి గురైన ఓ నిరుపేద జ‌ర్న‌లిస్టు జీవితానికి కొత్త ఆశ‌లు చిగురింప‌జేశాడు.

హైద‌రాబాద్: రీల్ లైఫ్‌లోనే కాదు రియ‌ల్ లైఫ్‌లోనూ గ్రేట్‌ హీరో అనిపించుకున్నాడు మంచు విష్ణు. ప‌క్ష‌వాతానికి గురైన ఓ నిరుపేద జ‌ర్న‌లిస్టు జీవితానికి కొత్త ఆశ‌లు చిగురింప‌జేశాడు. జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్‌ కుటుంబానికి విష్ణు తనవంతు సాయం అందించాడు. ఆయ‌న పిల్ల‌లను చ‌దివించేందుకు 22 ల‌క్ష‌ల విలువైన ఎడ్యుకేష‌న్ అందించేందుకు ముందుకొచ్చాడు.  ఏడాది కాలంగా ప‌క్ష‌వాతంతో మంచం ప‌ట్టి చావు బ‌తుల‌కుల‌తో పోరాడుతున్న‌ జ‌ర్న‌లిస్టు దుర్గాగౌడ్ క‌ష్టాల‌ను చూపుతూ 'మేము సైతం' కార్య‌క్ర‌మం తెర‌పైకి తెచ్చింది.

తన సోదరి మంచు లక్ష్మి నిర్వహిస్తున్న మేము సైతం కార్యాక్రమానికి  అతిథిగా హాజరైన మంచు విష్ణు.. బాధిత జ‌ర్న‌లిస్టు క‌ష్టాల‌ను విని క‌దిలిపోయాడు. ఒక్క రోజు పానీపూరి అమ్మి త‌న వంతుగా 75,000 రూపాయ‌లు సంపాదించాడు. వాటిని జ‌ర్న‌లిస్టు దుర్గా ఆరోగ్యం కోసం ఆర్థిక స‌హాయం చేస్తూ ఆయ‌న‌ పిల్ల‌లిద్ద‌రికి న‌ర్స‌రీ నుంచి ఇంట‌ర్ వ‌ర‌కు  రూ. 22 ల‌క్ష‌ల విలువైన కార్పోరేట్ విద్యను, వారి బాధ్య‌త‌లు చూసుకుంటాన‌ని ప్ర‌క‌టించాడు. ఈ భారీ స‌హాయం ప్ర‌క‌టించిన విష్ణుపై ప్ర‌శంస‌లు వ‌ర్షం కురుస్తోంది.

నిజ జీవితంలోనూ గ్రేట్ హీరో అనిపించుకున్న మంచువిష్ణుకు జ‌ర్న‌లిస్టులు కృత‌జ్ఞ‌త‌లు తెలిపారు.  మంచుల‌క్ష్మి కూడా త‌న‌వంతుగా ల‌క్ష రూపాయ‌ల సహాయం ప్ర‌క‌టించింది. మొత్తం 1 ల‌క్షా 75 వేల రూపాయల చెక్కును దుర్గాగౌడ్ కుటుంబానికి అందించారు. అంటే దాదాపుగా 24 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ స‌హాయం అందించిన మంచు విష్ణు, మంచు ల‌క్ష్మిల‌కు హ్యాట్సాప్. దొంగాట మూవీ డైరెక్ట‌ర్ వంశీకృష్ణ‌కు జ‌ర్న‌లిస్టులు స్పెష‌ల్ థ్యాంక్స్ చెబుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement