
కేసీఆర్ వాస్తవం మాట్లాడారు
పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవం మాట్లాడారని బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు.
పెద్దనోట్ల రద్దుపై బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్య
సాక్షి, హైదరాబాద్: పెద్ద నోట్ల రద్దుపై ముఖ్యమంత్రి కేసీఆర్ వాస్తవం మాట్లాడారని బీజేపీ పక్ష నేత కిషన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. అసెంబ్లీ సమావేశాల సందర్భంగా శుక్రవారం మీడియా పాయింట్‌లో మాట్లాడారు. కేసీఆర్ మాత్రమే కాకుండా నితీశ్‌కుమార్, నవీన్‌పట్నాయక్ వంటి వారు కూడా పెద్దనోట్ల రద్దును హర్షిస్తున్నారన్నారు. కొందరు కాంగ్రెస్ సీఎంలూ మద్దతిస్తున్నారన్నారు. అయితే కాంగ్రెస్ సహా కొన్ని ఇతర పార్టీలు ప్రజలకు తప్పుడు సంకేతాలు పంపు తున్నాయని కిషన్‌రెడ్డి విమర్శించారు.
పార్లమెంటులో మాట్లాడకుండా ఇక్కడేంటి?: గువ్వల
పార్లమెంటులో మాట్లాడకుండా, పెద్ద నోట్ల రద్దుతో సంబంధం లేని రాష్ట్ర అసెంబ్లీలో మాట్లాడటమేంటని టీఆర్‌ఎస్ సభ్యుడు గువ్వల బాలరాజు కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. మీడియా పాయింట్‌లో ఆయన మాట్లాడుతూ పార్లమెం టులో చర్చ జరిపే అవకాశమున్నా.. కాంగ్రెస్ అక్కడ సభను జరపకుండా తప్పుదోవ పట్టించిందన్నారు. మోదీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారు కాబట్టే ముఖ్యమంత్రి కేసీఆర్ మద్దతు ఇచ్చారని అన్నారు.