వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే.. | Four words if possible | Sakshi
Sakshi News home page

వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే..

Sep 9 2013 1:52 AM | Updated on Sep 1 2017 10:33 PM

వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే..

వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే..

ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే ప్రకటనలిస్తారు.. అయితే, ఇది ప్రేయసిని వెతుక్కోవడానికి ఇచ్చిన ప్రకటన! విషయమేమిటంటే.

 ఏదైనా ప్రోడక్ట్ అమ్మాలంటే ప్రకటనలిస్తారు.. అయితే, ఇది ప్రేయసిని వెతుక్కోవడానికి ఇచ్చిన ప్రకటన! విషయమేమిటంటే.. అమెరికాలోని షికాగోకు చెందిన గోర్డాన్  ఎంగెల్(40) ఈ మధ్య భార్య నుంచి విడాకులు తీసుకున్నాడు. ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. మళ్లీ తన మనసుకు నచ్చిన నెచ్చెలి వేటలో పడ్డాడు.
 
 ఆన్‌లైన్ డేటింగ్ సైట్లు వంటివాటిని ప్రయత్నించి, ప్రయత్నించి విసిగిపోయాడు. దీంతో వీలైతే నాలుగు మాటలు.. కుదిరితే కప్పు కాఫీ టైపులో.. ‘నా పేరు గోర్డాన్.. పద డిన్నర్‌కెళ్దాం’ అంటూ షికాగోలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌వే మీద ఈ వినూత్న భారీ ప్రకటన ఇచ్చాడు. ఇందుకోసం వేల డాలర్లు వెచ్చించాడు. ఈ బిల్‌బోర్డు మీదే గోర్డాన్ చిత్రం, అతడి డేటింగ్ వెబ్‌సైట్ www.helpgordyfindlove.com చిరునామా పెట్టాడు. దీనికి మంచి స్పందన లభిస్తోంది

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement