ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మళ్లీ తండ్రి కాబోతున్నారట.
ప్రముఖ సోషల్ నెట్‌వర్కింగ్ దిగ్గజం ఫేస్‌బుక్ సీఈవో మార్క్ జుకర్ బర్గ్ మళ్లీ తండ్రి కాబోతున్నారట. ఇప్పటికే ఒక పాపకు జన్మనిచ్చిన ప్రిస్కిల్లా రెండోసారి గర్భవతి అంటూ గురువారం తన ఫేస్‌బుక్ పోస్ట్‌లో తెలిపారు. ఆమె మళ్లీ గర్భవతి అయిన తెలియగానే తాను సంతోషించానంటే తన సంతోషాన్ని అభిమానులతో పంచుకున్నారు మార్క్. అంతేకాదు ఈసారి అమ్మాయి పుడితేనే బావుంటుందని ఆశపడుతున్నానని తెలిపారు. మొదటి ఆశ బిడ్డ ఆరోగ్యంగా ఉండం, రెండవ ఆశ ఆడబిడ్డ పుట్టడం అని చెప్పారు. తమకు ఇంతకంటే గొప్ప బహుబతి , అదృష్టం ఏదీ ఉండదన్నారు.
ఎందుకంటే ఎంతో దృఢమైన, తెలివైన ముగ్గురు అక్కల మధ్య నేను పెరిగాను..వారి నుంచి చాలా నేర్చుకున్నానంటూ చెప్పుకొచ్చారు. వాళ్లు నా అక్కలుమాత్రమే కాదు.. నాకు మంచి స్నేహితులు.అలాగే ప్రిస్కిల్లాకు కూడా ఇద్దరు అక్కలు. కుటుంబ విలువవలు, కష్టించేతత్వం, తోటి వారికి సాయపడడం ఆమె వారి నుంచి నేర్చుకుంది.
సోదరీమణులుగా, తల్లిగా, స్నేహితులుగా ఇంత బలమైన మహళలు మన జీవితాల్లో ఉన్నారు, కాబట్టే మన జీవితాలు మెరుగ్గా ఉన్నాయని చెప్పారు. అందుకే అలాంటి దృఢమైన మరో మహిళకు స్వాగతం చెప్పేందుకు ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నామని జుకర్ బర్గ్ తెలిపారు.