'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే' | CH. Ayyanna patrudu meeting with tdp mlas, mps and ministers at zp guest house in eluru | Sakshi
Sakshi News home page

'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే'

Jun 24 2015 1:16 PM | Updated on Mar 23 2019 8:59 PM

'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే' - Sakshi

'రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే'

సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్పైనే ఉందని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

ఏలూరు : సెక్షన్ - 8 అమలు చేయాల్సిన బాధ్యత గవర్నర్పైనే ఉందని ఆంధ్రప్రదేశ్ పంచాయితీ రాజ్ శాఖ మంత్రి సిహెచ్ అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఏలూరులో జెడ్పీ గెస్ట్హౌస్లో టీడీపీ ఎమ్మెల్యేలు, ఎంపీలతో మంత్రి అయ్యన్నపాత్రుడుతోపాటు జిల్లాకు చెందిన మంత్రి పీతల సుజాత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అయ్యన్నపాత్రుడు మాట్లాడుతూ... గవర్నర్ పాత్ర సమంజసంగా లేదన్నారు. గవర్నర్ పక్షపాతం లేకుండా సమస్యను పరిష్కరించాలని... అలాగే రెండు రాష్ట్రాలకు న్యాయం చేయాలని గవర్నర్ను డిమాండ్ చేశారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని పూర్తయ్యే వరకు హైదరాబాద్లోనే ఉంటామని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు. దౌర్జన్యం చేస్తే మర్యాదగా ఉండదని... మీకు దిక్కున్నది మీరు చేసుకోండని టీఆర్ఎస్ సర్కార్ను అయ్యన్న హెచ్చరించారు. మీ పోలీసులు మీకుంటే మా పోలీసులు మాకుంటారు... అలాగే మీ సీబీఐ మీకుంటే మా సీబీఐ మాకుంటుందన్నారు. నిట్ విషయంలో గందరగోళమే లేదన్నారు. పశ్చిమగోదావరి జిల్లాలోనే నిట్ ఏర్పాటవుతుందని తెలిపారు. అయితే టీడీపీ నేతల మధ్య విభేదాలు లేవని... బేధాభిప్రాయాలు మాత్రమేనని అయ్యన్నపాత్రుడు స్పష్టం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement