‘రాణిగారూ.. మళ్లీ అమెరికాను ఏలండి’ | Britain Queen Elizabeth -2 | Sakshi
Sakshi News home page

‘రాణిగారూ.. మళ్లీ అమెరికాను ఏలండి’

Oct 19 2015 2:43 AM | Updated on Apr 4 2019 5:04 PM

‘రాణిగారూ.. మళ్లీ  అమెరికాను ఏలండి’ - Sakshi

‘రాణిగారూ.. మళ్లీ అమెరికాను ఏలండి’

‘రాణి గారూ !మళ్లీ మా దేశాన్ని పాలించండి’ అని ఓ అమెరికన్.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు లేఖ రాశాడు. అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థులు

లండన్: ‘రాణి గారూ !మళ్లీ మా దేశాన్ని పాలించండి’ అని ఓ అమెరికన్.. బ్రిటన్ రాణి ఎలిజబెత్-2కు లేఖ రాశాడు. అమెరికా అధ్యక్ష స్థానానికి పోటీపడుతున్న అభ్యర్థులు అధికసంఖ్యలో ఉండటంతో విసుగు చెందిన అతడు ఈ లేఖ రాశాడు. రాణి ఈ ప్రతిపాదనను తిరస్కరించారు. బ్రిటన్ రాణి, ప్రధానికి  అమెరికన్ల తరఫున రాసిన ఆ లేఖలో ‘మా నాయకత్వ ప్రమాణాలు సరిగా లేవు. అమెరికాను మళ్లీ బ్రిటన్‌లో భాగంగా చేసుకుని మమ్మల్ని మళ్లీ మీరే పాలించాలి’ అని ఉంది. 

దీనికి రాణి నుంచి స్పందన లేఖ వచ్చింది.  ‘మరో సార్వభౌమ దేశ వ్యవహారాల్లో రాణి జోక్యం చేసుకోవడమన్న ప్రశ్నే ఉత్పన్నం కాదు’ అని ఆ లేఖలో పేర్కొన్నారు. రాణి తన కోరిక మన్నించకపోయినా ఆమె తీరు హుందాగా ఉందని ఆ అమెరికన్ పొంగిపోతున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement