‘స్వయం’వరం..! | britain photographer gets self married! | Sakshi
Sakshi News home page

‘స్వయం’వరం..!

Oct 6 2014 12:11 AM | Updated on Sep 2 2017 2:23 PM

‘స్వయం’వరం..!

‘స్వయం’వరం..!

సరదాకో, మతిపోయో పిల్లులను, కుక్కలను పెళ్లాడిన వాళ్లున్నారు. దోషాలు తొలగిపోవడానికి చెట్టు చేమలనూ మనువాడిన వాళ్లున్నారు.

లండన్: సరదాకో, మతిపోయో పిల్లులను, కుక్కలను పెళ్లాడిన వాళ్లున్నారు. దోషాలు తొలగిపోవడానికి చెట్టు చేమలనూ మనువాడిన వాళ్లున్నారు. కానీ బ్రిటన్‌కు చెందిన ఫొటోగ్రాఫర్ గ్రేస్ గెల్డన్ మాత్రం కాస్త వెరైటీ మనిషి. ఆమె తనను తానే పెళ్లిచేసుకుంది! ఆరేళ్లపాటు ఒంటరితనంతో కుదేలైన ఆమె పెళ్లాడ్డానికి తగిన మనిషి దొరకడం కష్టమని భావించి ఇటీవలే ఈ వింతపెళ్లికి పాల్పడింది. డేవన్‌లోని ఓ ఫామ్‌హౌస్‌లో పెళ్లికూతురిలా చక్కగా అలంకరించుకుని అద్దంలో తనను తాను ముద్దాడి ఈ తంతు పూర్తిచేసింది. దీనికి ఆమె సోదరి సహా 50 మంది అతిథులు హాజరయ్యారు. ‘‘నాకు నేను తెగ నచ్చేశాను.. ప్రేమలో పడిపోయాను. గాయని బ్జోర్క్ పాడిన పాటలోని ‘నా పేరు ఇజబెల్. నన్ను నేనే పెళ్లాడాను..’ అనే మాటలు మనసుకు హత్తుకుపోయాయి.

 

గత ఏడాది నవంబర్‌లో ఓ పార్క్ బెంచీపై కూర్చుని నిశ్చితార్థం చేసుకున్నాను. ఇదంతా స్వీయవ్యామోహమని కొందరు సరదాగా అన్నారు. కానీ తనను తాను పెళ్లి చేసుకున్నానని ఎవరైనా చెబితే అది నిజాయతీ గల స్వీయప్రేమ అని అంటాను’ అని గ్రేస్ చెప్పుకొచ్చింది. ఆమెకు పిచ్చెత్తిందని కొందరు నెట్‌లో విమర్శిస్తుంటే మరికొందరు ఆమె ఎవరినీ ఇబ్బంది పెట్టలేదు కదా అని సమర్థిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement