'చార్రితక నేపథ్యంలో తెలంగాణకు మద్దతు' | BJP Support Telangana backdrop of historical reasons, says Venkaiah Naidu | Sakshi
Sakshi News home page

'చార్రితక నేపథ్యంలో తెలంగాణకు మద్దతు'

Jan 24 2014 5:21 PM | Updated on Jun 18 2018 8:10 PM

'చార్రితక నేపథ్యంలో తెలంగాణకు మద్దతు' - Sakshi

'చార్రితక నేపథ్యంలో తెలంగాణకు మద్దతు'

విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అసెంబ్లీలో సీఎం కిరణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీవా అనేది స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు.

న్యూఢిల్లీ: విభజన బిల్లును వ్యతిరేకిస్తున్నానని అసెంబ్లీలో సీఎం కిరణ్ వ్యాఖ్యలు వ్యక్తిగతమా, పార్టీవా అనేది స్పష్టం చేయాలని బీజేపీ జాతీయ నేత వెంకయ్యనాయుడు డిమాండ్ చేశారు. అసెంబ్లీలో కిరణ్ మాట్లాడిన అంశాలు కాంగ్రెస్ అధిష్టానానికి తెలియదా అని ప్రశ్నించారు. తాను చెప్పినా కాంగ్రెస్ హైకమాండ్ ఎందుకు పట్టించుకోలేదో సీఎం కిరణ్ స్పష్టం చేయాలన్నారు. బిల్లుపై అసెంబ్లీలో చర్చ వక్తృత్వ పోటీ కాదని సభ్యులు గుర్తించాలన్నారు.

బిల్లుపై చర్చించారా అని కాంగ్రెస్ పెద్దలను తాను అడిగానని చెప్పారు. చర్చిస్తే సీఎం, పీసీసీ చీఫ్ ఎందుకు వ్యతిరేకిస్తున్నారని చిదంబరాన్ని ప్రశ్నించినట్టు వెల్లడించారు. ఇప్పుడు వ్యతిరేకించడంలో అర్థం లేదని తనతో చిదంబరం అన్నారని తెలిపారు. తెలంగాణ బిల్లుకు పార్లమెంట్‌లో సవరణలు ప్రతిపాదిస్తామని వెంకయ్య నాయుడు చెప్పారు.

మెజార్టీయే కావాలంటే దేశంలో ఏ రాష్ట్రం విడిపోదన్నారు. చార్రితక నేపథ్యంతోనే తెలంగాణకు మద్దతిస్తున్నామన్నారు. కాంగ్రెస్‌ ఇవ్వకపోతే బీజేపీ తెలంగాణ ఇస్తుందన్నారు. సీమాంధ్ర ప్రజలకు బీజేపీ న్యాయం చేస్తుందన్నారు. ఈ నెల 29న మోడీ ఫర్ పీఎమ్‌ ప్రచారాన్ని ప్రారంభిస్తామని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement