
బిగ్‌బాస్ ప్రజల్ని ఫూల్ చేస్తోందా?
తెలుగులో సక్సెస్ఫుల్ రన్ అవుతున్న బిగ్‌బాస్ షో చివరిదశకు చేరుకుంటుండగా..
తెలుగులో సక్సెస్ఫుల్ రన్ అవుతున్న బిగ్‌బాస్ షో చివరిదశకు చేరుకుంటుండగా.. హిందీలో బిగ్‌బాస్ షో ప్రారంభానికి రంగం సిద్ధమవుతోంది. సూపర్ స్టార్ సల్మాన్‌ఖాన్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ఈ బిగ్గెస్ట్ రియాలిటీ షో సిజన్-11 త్వరలో కలర్స్ చానెల్లో ప్రసారం కానుంది.
ఈ రియాలిటీ షోకు ప్రచారం కల్పించేందుకు ఇప్పటికే పలు టీజర్లను వదిలారు. తాజాగా బిగ్‌బాస్ షో కంటెస్టెంట్స్ ఎవరో తెలుపాలని ఫొటోలు పెడుతూ ట్విట్టర్లో ఓ క్విజ్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే, ఈ క్విజ్‌లో వాడుతున్న ఫొటోలు వివాదానికి దారితీస్తున్నాయి.
Ek aisa padosi jo behlaayega sab ka mann. Guess karo aur jeeto mauka Bigg Boss 11 live dekhne ka. #BBGuessList pic.twitter.com/spez3se833
— Bigg Boss (@BiggBoss) 19 September 2017
ఈ క్విజ్‌లో భాగంగా బిగ్‌బాస్ ట్విట్టర్ పేజీలో బుధవారం ఓ ఫొటో పెట్టి.. బిగ్‌బాస్‌లో పాల్గొనబోయే ఈ కంటెస్టెంట్ ఎవరో చెప్పాలంటూ నెటిజన్లను కోరారు. ఈ ఫొటోలో వ్యక్తి ముఖం కనిపించకుండా 'థికింగ్ బబుల్'ను అడ్డంగా ఉంచారు. దీంతో ఈ వ్యక్తి ఎవరై ఉంటారా? అని కొందరు నెటిజన్లు తికమక పడ్డారు. ప్రముఖ యూట్యూబర్ హర్ష బేనివాల్ ఈ ఫొటోలో వ్యక్తి అయి ఉంటారని కొందరు ఊహించారు. అయితే, ఈ ఫొటో ఒరిజనల్ బిగ్‌బాస్ కంటెస్టెంట్ది కాదని, 'షట్టర్‌స్టాక్' మోడల్ ఫొటో అని తాజాగా నెటిజన్లు పరిశోధించి తేల్చారు. ఫొటో సేవలు అందించే 'షట్టర్‌స్టాక్'లోని ఆఫ్రికన్-అమెరికన్ మోడల్ ఫొటోను పోస్టు చేసి.. తమను బిగ్‌బాస్ షో ఫూల్స్‌ను చేసిందని నెటిజన్లు మండిపడుతున్నారు. సోమవారం పెట్టిన క్విజ్ ఫొటో కూడా 'షట్టర్స్టాక్స్'దేనని తాజాగా తేలింది. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ షోపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఇదేం చెత్తక్విజ్ అని నెటిజన్లు మండిపడుతున్నారు. ఇలా నెటిజన్లను పిచ్చోళ్లను చేయడమేమిటని ప్రశ్నిస్తున్నారు.
And The 2nd Contestant of #BB11 #BiggBoss11 is.... Click here to know the name https://t.co/3sfxtR0oxd pic.twitter.com/2IkFVkSDzv
— Liv life 2 d fullest (@Chhota_Bhim) 19 September 2017