ఎయిర్ ఇండియా న్యూఇయర్ ఆఫర్ అదుర్స్
న్యూఇయర్లోకి అడుగుపెడుతున్న తరుణంలో నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది.
న్యూఇయర్లోకి అడుగుపెడుతున్న తరుణంలో నేషనల్ క్యారియర్ ఎయిర్ ఇండియా బంపర్ ఆఫర్ ప్రకటించింది. ఎంపిక చేసిన మార్గాలలో న్యూఇయర్ స్కీమ్ కింద వన్-వే ఎకనామిక్ క్లాస్ టిక్కెట్లు రూ.849కే అందించనున్నట్టు తెలిపింది. దీనిలోనే అన్ని చార్జీలను కలిపి ఉంటాయని పేర్కొంది. 2016 డిసెంబర్ 31 వరకు ఈ ఆఫర్ను ఎయిర్ ఇండియా అందుబాటులో ఉంచనుంది. 2017 జనవరి 15 నుంచి 2017 ఏప్రిల్ 30 వరకు ప్రయాణాలకు ఈ ఆఫర్ వర్తించనుంది. చెన్నై-కోయంబత్తూర్, బెంగళూరు-హైదరాబాద్ మార్గాలలో వన్ వే చార్జీ రూ.849కు అందుబాటులో ఉంచుతున్నట్టు తన వెబ్సైట్లో పొందుపరిచింది.
ఈ న్యూఇయర్ సేల్ కింద కవర్ అయ్యే మార్గాలు బెంగళూరు-చెన్నైకు రూ.1,199, ముంబాయి-గోవా రూ.1,499, ముంబాయి-బెంగళూరుకు రూ.1,599, శ్రీనగర్-ఢిల్లీకి రూ.1,999కు టిక్కెట్ ధర ఉండనుంది. ఇతర మార్గాలు గోవా-ఢిల్లీకు రూ.2,999, గోవా-చెన్నైకు రూ.2,199 టిక్కెట్ ధరలు ప్రారంభం కానున్నాయి. ఎయిర్ ఇండియా ప్రకటించిన న్యూఇయర్ ఆఫర్ కేవలం ఎంపికచేసిన సెక్టార్స్పై ఎకనామిక్ క్లాస్లో వన్-వే ప్రయాణాలకు మాత్రమే వర్తించనుంది. గ్రూప్ బుకింగ్స్కు ఇది వర్తించదని ఎయిర్ ఇండియా తెలిపింది.