వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్
సాక్షి, హైదరాబాద్: వరంగల్ పార్లమెంట్ ఉపఎన్నికల తీరుపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహిస్తారని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివకుమార్ తెలిపారు. ఈ మేరకు ఆదివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. సమీక్ష సమావేశంలో జీహెచ్‌ఎంసీ ఎన్నికలపై కూడా చర్చిస్తారని పేర్కొన్నారు. వరంగల్ ఉపఎన్నికల్లో పాల్గొన్న పార్టీ నాయకులు, జీహెచ్‌ఎంసీ నేతలు ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్రకార్యాలయానికి చేరుకోవాలన్నారు.