వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవాలి | YSRCP telangana Celebrations SRIKANTH REDDY | Sakshi
Sakshi News home page

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవాలి

Jun 2 2014 2:01 AM | Updated on May 29 2018 4:06 PM

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవాలి - Sakshi

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో సంబరాలు జరుపుకోవాలి

వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హు జూర్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో

 హుజూర్‌నగర్, న్యూస్‌లైన్ :వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో తెలంగాణ ఆవిర్భావ సంబరాలను ఘనంగా నిర్వహించాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. హు జూర్‌నగర్‌లోని ఆ పార్టీ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆ యన మాట్లాడారు. దశాబ్దాల కాలంగా అనేక ఉద్యమాలు, పోరాటాలు నిర్వహించి రాష్ట్రాన్ని సాధించుకున్న తెలంగాణ ప్రజలు అదే ఐక్యతతో రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేయాలన్నారు. జిల్లాలోని అన్ని మండల కేంద్రాలు, గ్రామాలలో వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలు జెండా ఆవిష్కరణలు గా వించి, సంబరాలు జరుపుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్ర సా దన కోసం అమరులైన వారికి నివాళులర్పించడంతో పాటు వారి కుటుంబాలకు అండగా ఉండాలన్నారు.  తెలంగాణను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసుకునేందుకు అధికార పార్టీకి వైఎస్సార్‌సీపీ సహకారం అందించనున్నట్లు తెలి పారు. ఈ సమావేశంలో ఆ పార్టీ నాయకులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement