32కుటుంబాలకు పరామర్శ | YS Sharmila visit in 32 families | Sakshi
Sakshi News home page

32కుటుంబాలకు పరామర్శ

Jan 20 2015 3:31 AM | Updated on Oct 19 2018 7:19 PM

వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టనున్న పరామర్శయాత్రలో భాగంగా ఆరు నియోజకవ ర్గాల్లో పర్యటించి

నాగార్జునసాగర్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు వైఎస్ షర్మిల జిల్లాలో చేపట్టనున్న పరామర్శయాత్రలో భాగంగా ఆరు నియోజకవ ర్గాల్లో పర్యటించి 32 కుటుంబాలను పరామర్శించనున్నట్లు తెలంగాణ రైతు విభాగం రాష్ట అధ్యక్షుడు ఎడ్మ కిష్టారెడ్డి, పార్టీ సాగర్ నియోజకవర్గ ఇన్‌చార్జ్ మల్లు రవీందర్‌రెడ్డి తెలిపారు. పరామర్శ యాత్ర ఏర్పాట్లను పరిశీలించటానికి సోమవారం నాగార్జునసాగర్ వచ్చిన ఆయన స్థానిక యూత్ హాస్టల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
 
 మహానేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి మరణవార్త విని తట్టుకోలేక మృతి చెందిన వారి కుటుంబాలకు మనోధైర్యం కల్పించటానికి ఆయన తనయుడు, వైఎస్సార్ సీపీ అధినేత జగన్‌మోహన్‌రెడ్డి ఇచ్చిన మాట ప్రకారం షర్మిల పరామర్శ యాత్ర చేపట్టినట్లు తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లాలో పరమార్శయాత్ర పూర్తయిందని, నల్లగొండ జిల్లాలోనూ ఈనెల 21నుంచి వారం రోజుల పాటు యాత్ర కొనసాగుతుందని చెప్పారు. షర్మిల దేవరకొండ నియోజకవర్గంలో పరామర్శ యాత్ర ప్రారంభిస్తారని,  ఆరాత్రి నాగార్జునసాగర్‌కు చేరుకోని అక్కడే బసచేస్తారని తెలిపారు. అనంతరం మిర్యాలగూడ, హుజూర్‌నగర్, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలో 27వ తేదీ వరకు యాత్ర కొనసాగుతుందన్నారు. వైఎస్ మరణవార్త విని జిల్లాలో మొత్తం 54 మంది మృతి చెందారని,
 
 మొదటి విడుతలో 32 కుటుంబాలను మిగతా వారిని వచ్చే నెలలో కొనసాగనున్న యాత్రలో పరామర్శిస్తారని వివరించారు. ఈ యా త్రలో తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ కమిటీ అధ్యక్షుడు, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, రైతు విభాగం, యువజన విభాగం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విభాగాల అధ్యక్షులు, రాష్ట్ర, జిల్లా కార్యవర్గం పాల్గొంటుందని తెలిపారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు,  అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని యాత్రను విజ యవంతం చేయాలని పిలుపునిచ్చారు.  సమావేశంలో నాయకులు గవాస్కర్‌రెడ్డి, లక్ష్మారెడ్డి, ఉపేందర్, నగేష్, జానీ, కొండల్‌రావు, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement