వారంపాటు యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం | woman raped by constable in tandur | Sakshi
Sakshi News home page

వారంపాటు యువతిపై కానిస్టేబుల్ అత్యాచారం

Nov 13 2014 3:18 AM | Updated on Mar 19 2019 5:52 PM

యువతిపై ఓ కానిస్టేబుల్ వారం రోజులుగా అత్యాచారం చేశాడు. రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన మల్లేశం(28) నాలుగేళ్లుగా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.

 తాండూరు: యువతిపై ఓ కానిస్టేబుల్ వారం రోజులుగా అత్యాచారం చేశాడు.  రంగారెడ్డి జిల్లా కుల్కచర్ల మండలం ఇప్పాయిపల్లికి చెందిన మల్లేశం(28) నాలుగేళ్లుగా కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. మూడేళ్ల క్రితం మల్లేశం తాండూరు మండలం జినుగుర్తికి చెందిన ఓ యువతి(20)ని వివాహం చేసుకునేందుకు పెళ్లి చూపులకు వెళ్లాడు. కాగా అప్పట్లో యువతి తల్లిదండ్రులు పెళ్లికి నిరాకరించారు. అనంతరం సదరు యువతితో మల్లేశం ఫోన్‌లో తరచూ మాట్లాడుతూ స్నేహం పెంచుకుంటున్నాడు.
 
 
 రెండేళ్ల క్రితం మల్లేశం యాలాల మండలానికి చెందిన యువతిని పెళ్లి చేసుకున్నాడు. వీరికి ఇద్దరు కొడుకులు. అనంతరం మల్లేశం తనకు వివాహం కాలేదని జినుగుర్తికి చెందిన యువతిని నమ్మించాడు. ఈ క్రమంలో ఆమెను గౌతపూర్‌లోని తన అద్దె గదికి తీసుకెళ్లి వారం రోజులపాటు అత్యాచారం చేశాడు. తనను పెళ్లి చేసుకోవాలని యువతి మల్లేశంను కోరడంతో వివాహం అయిన విషయం చెప్పాడు. దీంతో బాధితురాలు బుధవారం కరన్‌కోట్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.  నిందితుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
 

Advertisement
 
Advertisement
Advertisement