భర్త ఇంటిముందు భార్య న్యాయపోరాటం | Wife stages dharna in front of husband's house | Sakshi
Sakshi News home page

భర్త ఇంటిముందు భార్య న్యాయపోరాటం

Sep 25 2015 3:24 PM | Updated on Jul 27 2018 2:18 PM

త్రిపురారం మండలం బాబా సాయిపేటలో శుక్రవారం ఓ మహిళ తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది.

నల్గొండ (త్రిపురారం) : త్రిపురారం మండలం బాబా సాయిపేటలో శుక్రవారం ఓ మహిళ తన భర్త ఇంటి ముందు న్యాయ పోరాటానికి దిగింది. తనను కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు శుక్రవారం ఆందోళన చేపట్టింది.వివరాల్లోకి వెళ్తే.. బాబాసాయిపేట గ్రామానికి చెందిన గట్టు శ్రీను(27), తిప్పరి మండలం జొన్నలగడ్డ గ్రామానికి చెందిన విమల(22)లు 8 సంవత్సరాల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. కొన్నాళ్లపాటు వీరి వివాహం సజావుగానే సాగింది.

తర్వాత శ్రీను తన భార్యకు తెలియకుండా మరో స్త్రీని ఇటీవల వివాహం చేసుకున్నాడు. తనను భర్త కాపురానికి తీసుకెళ్లే వరకు ఇక్కడ నుంచి కదలనని భీష్మించుకు కూర్చుంది. శ్రీను మరో ఇద్దరిని కూడా వివాహం చేసుకున్నట్లు స్థానికులు అనుకుంటున్నారు. స్థానికుల సమాచారంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. పోలీసులు ఇరువురిని కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement