కొండెక్కిన నాటు కోడి

Village Chicken Prices Rises in Hyderabad - Sakshi

నగరంలో నాటు కోళ్ల కొరత

గ్రామాల నుంచి దిగుమతి కాని నాటు కోళ్లు

రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఎగబడుతున్న సిటీవాసులు  

కిలో కోడి రూ. 500 పైనే

సాక్షి సిటీబ్యూరో: ఆదివారం నాజ్‌వెజ్‌పై గ్రేటర్‌ వాసులు ఆసక్తి చూపుతారు. అంతేగాక నగరంలో బోనాల ఉత్సవాలు జరుగుతుండటంతో నాజ్‌వెజ్‌ తప్పక ఉండాల్సిందే. అయితే కరోనా ప్రభావంతో  నాటు కోళ్లకు కరువొచ్చింది. ఏ చికెన్‌ మార్కెట్, చికెన్‌ సెంటర్‌కు వెళ్లిన నో స్టాక్‌ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ఒక వేళ నాటు కోడి దొరికినా వాటి ధరలు చూస్తే సిటీజనులు గుడ్లు తేలేస్తున్నారు. అయితే కొందరు మాత్రం నాటుకోళ్లతో రోగనిరోధ శక్తి పెరుగుతుందని, తద్వారా కరోనా నుంచి బయటపడవచ్చుననే ఉద్ధేశంతో ధర ఎక్కువైనా కొనుగోలు చేస్తున్నారు. నగరంలొని దాదాపు అన్ని చికెన్‌ సెంటర్‌లలో బ్రాయిల్, లేయర్‌ కోళ్లతో పాటు నాటు కోళ్లను కూడా విక్రయిస్తారు. అయితే గత నెల రోజులుగా నగరంలో నాటు కోళ్లు అందుబాటులో లేవు. గ్రామాల నుంచి కోళ్లు దిగుమతి కాకపోవడమే ఇందుకు కారణమని చికెన్‌ సెంటర్‌ నిర్వాహకులు చెబుతున్నారు. గ్రామాల్లోనే నాటు కోళ్ల ధరలు రూ. 300– రూ. 350 వరకు పలుకుతున్నాయి. కొందరు వ్యాపారులు వీటిని నగరానికి తీసుకువచ్చి కిలో కోడి రూ. 500కు పైగా విక్రయిస్తున్నారు.

కొరతకు కారణాలివీ..
గ్రేటర్‌లో గత 15 రోజులుగా నాటు కోడికి విపరీతంగా డిమాండ్‌ పెరిగింది. గ్రేటర్‌ ప్రజలు కరోనా బారినుంచి పడకుండా రోగనిరోధక శక్తి పెంచుకునేందుకు నాన్‌వెజ్‌పై ఆసక్తి చూపుతున్నారు. ఇందులో భాగంగా బ్రాయిలర్‌ చికెన్‌లో అంతగా పోషకాలు ఉండవని నాటు కోళ్లపై మొగ్గు చూపుతున్నారు. దీంతో నాటు కోడికి విపరీతంగా డిమాండ్‌ పెరగడంతో పాటు ధరలు కూడా భారీగా పెరిగాయని అమీర్‌పేట్‌కు చెందిన చికెన్‌ వ్యాపారి గఫూర్‌ తెలిపాడు. 

తగ్గిన సరఫరా
గ్రేటర్‌ శివారు ప్రాంతాల నుంచే కాకుండా కరీంనగర్, మెదక్, నల్లగొండతో పాటు రాయసీమ జిల్లాల నుంచి నాటు కోళ్లు నగరానికి దిగుమతి అవుతా యి. అయితే గ్రామాల్లోనూ ప్రజలు నాటు కోళ్లను  తింటుండటంతో నగరానికి సరఫరా దాదాపుగా నిలిచిపోయింది. దీంతో పాటు త్వరలో ప్రారంభ ం కానున్న మేడారం జాతరను దృష్టిలో ఉంచుకుని నాటు కోళ్లను విక్రయిండం లేదని ఎల్‌బీనగర్‌ హోల్‌సెల్‌ కోళ్ల వ్యాపారి కిషోర్‌ తెలిపారు. నగరంలోని హోల్‌సెల్‌ వ్యాపారులు గ్రామాలకువెళ్లి నా టు కోళ్లను కొనుగోలు చేసి నగరానికి తీసుకొచ్చి విక్రయిస్తారు. అయితే ప్రస్తుతం పలు గ్రామాల్లో నాటు కోళ్లు దొరకడం లేదు. మరోవైపు ఉన్నా   అమ్మడం లేదని వ్యాపారులు చెబుతున్నారు.  నాటు కోళ్ల స్థానంలో హైబ్రిడ్‌ కోళ్లునాటు కోళ్ల స్థానంలో ఫామ్‌లలో హైబ్రిడ్‌ కోళ్లు (నాటు కోళ్లు) పెంచి విక్రయిస్తున్నారు. ఇవి అచ్చ ం నాటు కోళ్ల మాదిరిగానే ఉంటాయి. అయితే వీటిని ఇళ్లలో కాకుండా బ్రాయిలర్‌ ఫామ్‌ తరహా లో పెంచుతున్నారు. ప్రస్తుతం నగరంలో ఈ కోళ్లు ఎక్కువగా చికెన్‌ సెంటర్లలో అందుబాటులో ఉన్నాయి. తెలియని వారికి నాటు కోళ్ల పేరుతో నాంపల్లి, ముర్గీచౌక్‌తో పాటు పలు చికెన్‌ సెంటర్‌లలో కిలో రూ. 300– రూ. 350 వరకు విక్రయిస్తున్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top