విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు | Vigilance attacks on seed stores | Sakshi
Sakshi News home page

విత్తన దుకాణాలపై విజిలెన్స్‌ దాడులు

Jun 13 2017 5:51 AM | Updated on Sep 5 2017 1:31 PM

మిర్యాలగూడ పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు.

మిర్యాలగూడ : మిర్యాలగూడ పట్టణంలోని విత్తనాలు, ఎరువుల దుకాణాలపై విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారులు సోమవారం దాడులు నిర్వహించారు. పట్టణంలోని పాత మార్కెట్‌ యార్డు రోడ్డులో ఉన్న భవాని ఆగ్రో కెమికల్స్, రైతుమిత్ర ఫెర్టిలైజర్స్‌ అండ్‌ సీడ్స్‌ దుకాణాలపై విజిలెన్స్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డీఈ శంకర్‌రెడ్డి ఆధ్వర్యంలో దాడులు జరిగాయి. ఈ సందర్భంగా డీఈ శంకర్‌రెడ్డి మాట్లాడుతూ తనిఖీలు నిర్వహించిన రెండు దుకాణాల్లో పత్తి విత్తనాలకు సంబంధించిన స్టాక్‌ రిజిస్టర్‌ సరిగా లేకపోవడం వల్ల నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. స్టాక్‌ రిజిస్టర్‌కు, నిల్వలకు 700 పత్తి విత్తనాల ప్యాకెట్లు తేడా ఉన్నాయని తెలిపారు.

 విత్తనాలకు సంబ ంధించిన కంపెనీ రశీదులు చూపించే వరకు విక్రయించవద్దని ఆదేశించినట్లు పేర్కొన్నారు. దాంతో పాటు ప్రాసెసింగ్‌ చేయని విత్తనాలు ఉన్నాయన్నారు. రెండు దుకా ణాల్లో తేడాలు ఉన్న విత్తనాల విలువ సుమా రు రూ.5.60 లక్షల విలువ ఉంటుందని తెలిపారు. నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఖరీఫ్‌ సీజన్‌ సమీపిస్తుండటంతో ప్రభుత్వ ఆదేశాలతో విత్తనాలు, ఎరువుల దుకా ణా లపై దాడులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో విజిలెన్స్‌ ఏఓ శరత్‌చంద్ర, విజిలెన్స్‌ సీఐలు చరమందరాజు, నర్మింహరాజు, మండల వ్యవసాయాధికా రిని జయప్రద, కానిస్టేబుళ్లు వెంకట్‌రెడ్డి, నర్సిం హారెడ్డి తదితరులున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement