
‘వన్‌ఫుల్‌మీల్స్’కు ప్రత్యేక కమిటీలు
వన్‌ఫుల్‌మీల్స్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ 3462ను జారీ చేసింది.
చైర్మన్‌గా సర్పంచులు..
సుల్తానాబాద్: వన్‌ఫుల్‌మీల్స్ అమలును పర్యవేక్షించేందుకు ప్రత్యేక కమిటీలు వేయనున్నారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం మెమో నెంబర్ 3462ను జారీ చేసింది. అంగన్‌వాడీ కేంద్రాల్లో వన్‌ఫుల్‌మీల్స్ గర్భిణులు, బాలింతలకు ఏర్పాటుచేసింది. దానిని పర్యవేక్షించేందుకు ఆయా గ్రామపంచాయతీ సర్పంచులను చైర్మన్లుగా నియమించింది. రెండుఅంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నచోట మహిళా వార్డు మెంబర్ చైర్మన్‌గా ఉండే అవకాశం కల్పించారు.
కన్వీనర్‌గాఅంగన్‌వాడీకార్యకర్తలు వ్యవహరించనున్నారు. గర్భిణులనుంచి ఒకరు, బాలింత ఒకరు, సామాన్య శాస్త్ర ఉపాధ్యాయురాలు ఒకరు, రిటైర్డ్ ప్రభుత్వం ఉద్యోగి ఒకరు, ఫ్రీస్కూల్ చిల్డ్రన్ నుంచి తల్లులు ముగ్గురు, ఆశ వర్కర్ ఒకరు, స్వచ్ఛంద సంస్థ ఆర్గనైజర్లు ఇద్దరు సభ్యులుగా వ్యవహరించనున్నారు. వెంటనే గ్రామాల్లో కమిటీలు వేసి సీడీపీవోలకు నివేదికలు అందివ్వాలని సూచించారు.
కొత్తగా 5 రిజిస్టర్లు
అంగన్‌వాడీ కేంద్రాల్లో గర్భిణులు, బాలింతలను నమోదు చేసేందుకు రిజిస్టర్ ఒకటి ఏర్పాటుచేశారు. బరువుకు ఒకటి, హిమోగ్లోబిన్‌కు ఒకటి, మాతృమార్పుకు ఒకటి, శిశు మాతృమరణాలకు ఒకటి, డెలివరీ తేదీలను గురించి రిజిస్టర్‌లను ఎప్పటికప్పుడు రాస్తూ కమిటీ ముందు అంగన్‌వాడీ కార్యకర్త ముందుంచాలి. ఆరోగ్యలక్ష్మి పథకం ద్వారా పౌష్టికాహారం అందడంతోపాటు సెంటర్‌లోనే భోజనం చేసేలా చూడడం కమిటీ బాధ్యత. సమయ పాలన, మెనూ ప్రకారం భోజనం, శుభ్రత ఆహారం అందించేలా పర్యవేక్షణ ఉండాలి.
ప్రత్యేక అకౌంట్..
అంగన్‌వాడీ కార్యకర్తలకు నేరుగా ఆన్‌లైన్‌లో డబ్బులు జమచేసేందుకు ప్రత్యేక అకౌంట్‌లను నమోదు చేస్తున్నారు. రోజువారీగా పాలు తీసుకురావడం, గర్భిణులు, బాలింతలకు అందించడం వారివిధి. వారికి అయ్యే ఖర్చును అంగన్‌వాడీ సూపర్‌వైజర్‌లకు అందించడంతో అధికారులు నేరుగా అకౌంట్‌లో ఖర్చులు వేయనున్నట్లు సీడీపీవో సరస్వతి తెలిపారు.
నెలవారీగా నివేదికలు అందివ్వాలి..
కమిటీసభ్యులు విధిగా వన్‌ఫుల్‌మీల్స్ పథకాన్ని పరిశీలించి ధ్రువీకరిస్తేనే అంగన్‌వాడీల అకౌంట్‌లలో డబ్బులు స్త్రీశిశు సంక్షేమ శాఖ అధికారులు వేయనున్నారు. జిల్లాలో 3,700 అంగన్‌వాడీ కేంద్రాలను సూపర్‌వైజర్‌లు, సీడీపీవోలు సైతం పరిశీలిస్తారు.