ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామ శివారులోని క్రాసింగ్ వద్ద జరిగింది.
నిజామాబాద్ : ఎదురెదురుగా వస్తున్న ట్రాక్టర్, బైకు ఢీకొని ఇద్దరు యువకులు మృతిచెందారు. ఈ ఘటన నిజామాబాద్ జిల్లా దోమకొండ మండలం కోనాపూర్ గ్రామ శివారులోని క్రాసింగ్ వద్ద జరిగింది. వివరాల ప్రకారం.. కోనాపూర్ గ్రామానికి చెందిన చిందం పరశురాములు(23), బీరయ్య(35) అనే ఇద్దరు గొర్రెల కాపరులు మండలంలోని బీబీపేట్‌కు వెళ్లి తిరిగి వస్తుండగా.. గ్రామ శివారులోని క్రాసింగ్ వద్ద ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొట్టింది.
దీంతో బైక్ నడుపుతున్న పరశురాములు అక్కడికక్కడే మృతిచెందగా, బీరయ్యను కామారెడ్డి ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నారు.