ఆర్టీసీ బస్సుపై రాళ్ల దాడి

TSRTC Strike: Stone Attack On RTC Bus In Vikarabad - Sakshi

సాక్షి, వికారాబాద్‌ :  వికారాబాద్ జిల్లా పోలీస్ శిక్షణ కేంద్రం వద్ద  ఆర్టీసీ బస్సుపై గుర్తు తెలియని వ‍్యక్తులు రాళ్లదాడి చేశారు. వికారాబాద్ బస్ డిపోకు చెందిన బస్సు పరిగి నుండి వికారాబాద్‌కు వస్తుండగా ఇద్దరు వ్యక్తులు బైక్ పై వచ్చి రాళ్లతో దాడి చేశారు. ఈ సంఘటనలో బస్సు ముందు వైపు అద్దం పూర్తిగా పగిలిపోయింది. అయితే ప్రయాణికులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు.


పోలీస్‌ ఎస్కార్ట్‌తో తిరుగుతున్న ఆర్టీసీ బస్సులు
బస్సు వెంబడి పోలీసుల ఎస్కార్టు వాహనం ఉన్నప్పటికీ దుండగులు మెరుపు వేగంతో దాడి చేసి పారిపోయారు. కాగా ఆర్టీసీ ఉద్యోగులే ఈ దాడి చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. మరోవైపు జిల్లాలోని మూడు ఆర్టీసీ డిపోలలో ప్రయివేట్‌ డ్రైవర్లతో 150 బస్సులను పోలీస్‌ బందోబస్తు మధ్య నడిపిస్తున్నారు. కాగా తమ డిమాండ్ల సాధన కోసం 57వేల మంది తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మెకు దిగిన విషయం తెలిసిందే. 

చదవండి:

బస్సు సీటు కోసం.. ఎన్ని పాట్లో

బస్సులు నిల్... మెట్రో ఫుల్...

ఆర్టీసీ సమ్మె: మా టికెట్ రిజర్వేషన్ల సంగతేంటి?

ఒక్క బస్సు... చుట్టుముట్టేశారు...

డ్యూటీలోకి రాకుంటే.. వేటేస్తాం..

ఆర్టీసీ సమ్మె షురూ..

ఆర్టీసీ సమ్మె : కేసీఆర్ కీలక నిర్ణయం

ఆర్టీసీ కార్మికులకు తీవ్ర హెచ్చరిక

ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడండి

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top