రూ.800 కోట్లు నష్టపోయాం: కవిత | TRS mp Kavitha comments on demonitisation in loksabha | Sakshi
Sakshi News home page

రూ.800 కోట్లు నష్టపోయాం: కవిత

Mar 21 2017 7:27 PM | Updated on Sep 27 2018 9:08 PM

రూ.800 కోట్లు నష్టపోయాం: కవిత - Sakshi

రూ.800 కోట్లు నష్టపోయాం: కవిత

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు.

ఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పెద్దనోట్ల రద్దుతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయిందని తెలంగాణ సీఎం కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యానించారు. పెద్దనోట్ల రద్దు అంశంతో రాష్ట్రానికి నష్టాలొచ్చాయని టీఆర్ఎస్ ఎంపీ కవిత తాజాగా పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం రూ.800 కోట్లు నష్టపోయిందని కవిత అన్నారు. లోక్‌సభలో మంగళవారం ఆమె మాట్లాడుతూ.. పెద్దనోట్ల రద్దు అంశంపై కేంద్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆమె డిమాండ్ చేశారు. వృద్ధాప్య పింఛన్లను రూ.200 నుంచి రూ. 500లకు పెంచాలని కేంద్రాన్ని ఆమె కోరారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా ఇవ్వాలని ఎంపీ కవిత విజ్ఞప్తి చేశారు.
 
ఇటీవల తెలంగాణ శాసన మండలిలో కేసీఆర్ మాట్లాడుతూ.. రియల్ ఎస్టేట్ బూమ్ బ్రహ్మాండంగా ఉండి ఆదాయం ఊపందుకుందన్నారు. సరిగ్గా ఇలాంటి సమయంలో 500, 1000 రూపాయల నోట్లను రద్దుచేసి, కొత్త నోట్ల అందుబాటు కూడా తక్కువగా ఉండటంతో రియల్ ఎస్టేట్ రంగం కుదేలై తన కాళ్లు విరగ్గొట్టినట్లు అయ్యిందన్న విషయాన్ని తాను ప్రధాని నరేంద్ర మోదీకి వివరించానని ఆయన చెప్పారు. పెద్దనోట్లను రద్దు చేస్తూ ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటన చేసిన తర్వాత ఆయనతో మాట్లాడిన మొట్టమొదటి ముఖ్యమంత్రి తానేనని కేసీఆర్ చెప్పిన విషయం తెలిసిందే. 
 
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement