‘అంబేడ్కర్‌’పై నేడు తుది నిర్ణయం

Today is the final decision on Ambedkar statue - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: సచివాలయం పక్కన 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహాన్ని నెలకొల్పాలనుకున్న ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనకు అంబేడ్కర్‌ విగ్రహ కమిటీ తుదిరూపం ఇచ్చింది. ఈ మేరకు మంగళవారం సచివాలయంలో అంబేడ్కర్‌ విగ్రహ కమిటీ చైర్మన్, ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన సమావేశం జరిగింది. కమిటీ రూపొందించిన ప్రతిపాదనలతో బుధవారం సీఎం కేసీఆర్‌తో సమావేశమై అంతిమ నిర్ణయానికి రావాలని నిర్ణయించారు.

దేశ విదేశాలు తిరిగిన కమిటీ ఢిల్లీకి చెందిన డిజైన్‌ అసోసియేట్స్‌ రూపొందించిన నమూనాలు, విగ్రహం నెలకొల్పనున్న ప్రాంతంలో నిర్మించ తలపెట్టిన భవన సముదాయం, పార్క్‌కు ఆమోదం తెలిపింది. ఎటువంటి విగ్రహం పెట్టాలన్న నిర్ణయం మాత్రం కేసీఆర్‌కు వదిలి పెట్టాలని కమిటీ నిర్ణయించింది. లోక్‌సభ ప్రాంగణంలోని విగ్రహ నమూనాతోపాటు ట్యాంక్‌బండ్‌ వద్ద ఉన్న విగ్రహం, జేఎన్‌టీయూ ఫైన్‌ ఆర్ట్స్‌ కళాశాలకు చెందిన శిల్పి బోళ్ళ శ్రీనివాసరెడ్డి రూపొందించినది కలిపి మూడు విగ్రహాల ప్రతిపాదనలను కేసీఆర్‌ ముందు ఉంచాలని కమిటీ నిర్ణయించింది. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎంలు  కడియం శ్రీహరి, మహమూద్‌అలీ, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, జగదీశ్‌రెడ్డి, బుద్ధవనం అభివృద్ధి చైర్మన్‌ మల్లేపల్లి లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top