నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ | Today, Delhi Chief KCR | Sakshi
Sakshi News home page

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

Feb 5 2015 1:26 AM | Updated on Aug 15 2018 9:27 PM

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్ - Sakshi

నేడు ఢిల్లీకి సీఎం కేసీఆర్

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు హస్తినలోనే ఉం డేలా పర్యటన ప్రణాళిక ఖరారైంది.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు గురువారం సాయంత్రం ఢిల్లీ వెళ్లనున్నారు. ఐదు రోజుల పాటు హస్తినలోనే ఉం డేలా పర్యటన ప్రణాళిక ఖరారైంది. ఈ నెల 8న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగే ‘నీతి ఆయోగ్’ తొలి సమావేశానికి కేసీఆర్ హాజరుకానున్నారు. ఈ భేటీకి మూడు రోజుల ముందే ఢిల్లీ వెళ్తున్న సీఎం పది మందికిపైగా కేంద్ర మంత్రులతో భేటీకానున్నారు.

కేంద్రం నుంచి రాష్ట్రానికి అందాల్సిన ఆర్థిక సాయం, రాష్ట్రానికి ప్రత్యేకహోదా, హైకోర్టు విభజన, మిషన్ కాకతీయకు సాయం తదితరాలపై ఆయన కేంద్రమంత్రులకు విన్నవించనున్నారు. సీఎం పర్యటన వివరాలను ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేకప్రతినిధి వేణుగోపాలాచారి బుధవారమిక్కడ సచివాలయంలో విలేకరులకు వెల్లడించారు.

ప్రాణహిత-చేవెళ్లకు జాతీయ హోదా, రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వాటర్‌గ్రిడ్‌కు కేంద్ర నిధులు తదితరాలపై కేసీఆర్ కేంద్రమంత్రులతో చర్చిస్తారని వివరిం చారు. మిషన్ కాకతీయ ప్రారంభానికి ఆహ్వానం,  కృష్ణా నదీ జలాల వివాదాన్ని  మంత్రి ఉమాభారతి దృష్టికి తీసుకెళ్లనున్నారు. మంత్రికి ఇచ్చే నోట్‌ను సైతం అధికారులు ఇప్పటికే సిద్ధం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement