ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు | Three trapped in Iraq | Sakshi
Sakshi News home page

ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు

Jun 23 2014 3:40 AM | Updated on Sep 2 2017 9:13 AM

ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు

ఇరాక్‌లో చిక్కుకున్న ముగ్గురు

బతుకుదెరువు కోసం ఇరాక్‌కు వెళ్లిన వర్ధన్నపేట మండల కేంద్రంలోని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆలకుంట్ల కుమార్, వల్లెపు యాకయ్య, బొంత రవి అక్కడ చిక్కుకుని పోయారు.

- అందరూ వర్ధన్నపేట వాసులే...
- అధికారుల రక్షణలో ఉన్నట్లు వెల్లడి
- ఆందోళనలో కుటుంబ సభ్యులు
- స్పందించాలని సర్కారుకు వేడుకోలు

వర్ధన్నపేట : బతుకుదెరువు కోసం ఇరాక్‌కు వెళ్లిన వర్ధన్నపేట మండల కేంద్రంలోని వడ్డెర సామాజిక వర్గానికి చెందిన ఆలకుంట్ల కుమార్, వల్లెపు యాకయ్య, బొంత రవి అక్కడ చిక్కుకుని పోయారు. ఇరాక్‌లో అంతర్యుద్ధం జరుగుతుండడం.. ముగ్గురి క్షేమ సమాచారం తెలియకపోవడంతో వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. సమాచారం అందుకున్న ‘సాక్షి’.. ఇరాక్‌లో ఉన్న రవితో ఫోన్‌లో మాట్లాడింది. తాము ప్రస్తుతం యుద్ధం జరిగే ప్రదేశానికి దూరంగా ఉన్నామని, అధికారుల రక్షణలోనే ఉన్నప్పటికీ ఎప్పుడు, ఏమవుతుందోనని భయాందోళన వ్యక్తం చేశాడు. కాగా, కుమార్ భార్య తన తల్లిదండ్రులతో ప్రభుత్వ పెద్దలను కలిసినట్లు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.

ప్రస్తుతం వారు అప్పుడప్పుడు ఫోన్ ద్వారా కుటుంబ సభ్యులకు క్షేమ సమాచారం అందిస్తున్నారని చెప్పారు. తమ వారిని క్షేమంగా ఇంటికి తీసుకువచ్చే విధంగా  ప్రభుత్వం చర్యలు తీసుకు ని.. తమ కుటుంబాలను ఆదుకోవాలని వా రు కోరుతున్నారు. ఇదిలాఉండగా... ఆల కుంట్ల కుమార్‌కు తల్లిదండ్రులు కొంరయ్య,సుగుణమ్మ, భార్య లక్ష్మి, కుమారుడు జగన్, కూతురు అశ్విని ఉన్నారు. వల్లెపు యాకయ్య కు భార్య సావిత్రితోపాటు ముగ్గురు సంతా నం ఉండగా పెద్దకూతురు మమతకు పెళ్లరుుంది. రెండో కూతురు కుమారి, కుమారు డు బిక్షపతి ఉన్నారు. బొంత రవికి భార్య విజయ, ఇద్దరు కూతుళ్లు రమ్య, భూమిక, కుమారుడు బన్ని ఉన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement