చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమ వెతలను గుర్తించి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడంపై ఆరోగ్యశ్రీ ఉద్యోగులు ...
న్యూశాయంపేట : చాలీచాలని వేతనాలతో పనిచేస్తున్న తమ వెతలను గుర్తించి సీఎం కేసీఆర్ వేతనాలు పెంచడంపై ఆరోగ్యశ్రీ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మేరకు శనివారం హన్మకొండ ఏకశిలా పార్కులో కేసీఆర్ చిత్రపటంతో పాటు ఆచార్య జయశంకర్ విగ్రహని కి ఉద్యోగ సంఘం నాయకులు పాలాభిషేకం నిర్వహిం చారు. వేతనాలు పెంచడం పట్ల ఉద్యోగ సంఘం నాయకులు ముఖ్యమంత్రి కేసీఆర్, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు.
కార్యక్రమం లో తెలంగాణ ఆరోగ్యశ్రీ ఔట్ సోర్సింగ్ ఎంప్లాయూస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎం.కుమారస్వామి, నాయకులు శ్రీకాంత్, పావని, రాజేశ్, శ్రీనివాస్, రాజ్‌కుమార్, రంజిత్, శంకర్, చక్రపాణి, అశోక్, పవన్, మమత, రజిత, కిరణ్, శ్రీనివాస్, రవి పాల్గొన్నారు.